https://oktelugu.com/

Rana Naidu: బాబాయ్ తో అబ్బాయి సిరీస్.. కాజల్ రిక్వెస్ట్ తో నిషాకి ఛాన్స్ !

Rana Naidu: వెంకటేష్ (Venkatesh)- రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఎదురుచూపులకు ఫలితం రానుంది. వీరి కాంబినేషన్ లో రానున్న వెబ్ సిరీస్ గురించి తాజాగా రానా ట్వీట్ చేశాడు. ‘మా బాబాయ్ (వెంకటేశ్‌)తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కల. అయితే ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అంటూ రానా ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. రానా – వెంకీ […]

Written By: , Updated On : September 22, 2021 / 04:00 PM IST
Follow us on

Rana NaiduRana Naidu: వెంకటేష్ (Venkatesh)- రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఎదురుచూపులకు ఫలితం రానుంది. వీరి కాంబినేషన్ లో రానున్న వెబ్ సిరీస్ గురించి తాజాగా రానా ట్వీట్ చేశాడు. ‘మా బాబాయ్ (వెంకటేశ్‌)తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కల. అయితే ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అంటూ రానా ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు.

రానా – వెంకీ కలయికలో ఓ వెబ్‌ సిరీస్‌ రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ అవి ఇప్పటివరకు రూమర్స్ అనుకున్నారు. కానీ ఆ వార్తలు నిజమే అని తేలడం నిజంగా విశేషమే. ఇక ఓ ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌ తో ఈ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. పైగా ఈ సిరీస్ కి ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ పెట్టారు.

టైటిల్ వింటుంటే… రామానాయుడు గారు గుర్తుకొస్తున్నారు. అన్నట్టు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సిరీస్‌ రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ప్లిక్స్‌ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ లో కాజల్‌ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌ రీఎంట్రీ ఇవ్వబోతుంది. కాజల్ ఎలాగూ గర్భవతి కాబట్టి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

అందుకే, ఈ గ్యాప్ లో తన చెల్లిని ఎంకరేజ్ చేయాలని ప్లాన్ చేసుకుంది. కాజల్ రిక్వెస్ట్ చేస్తేనే.. రానా నిషా అగర్వాల్ ను ఈ సిరీస్ లో తీసుకున్నాడట. ఇక ఒకే తెర పై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలం గా ఉన్న అభిమానులకు, బాబాయ్ అబ్బాయి ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తారో చూడాలి.

ఇక ఈ సిరీస్ గురించి వెంకటేష్ స్పందిస్తూ.. ‘ఓ చిన్నపిల్లాడి నుంచి మంచి పరిణితి చెందిన నటుడిగా నా ముందు ఎదిగిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. త్వరలోనే ‘రానా నాయుడు’ మీ ముందుకు వస్తుంది” అని చెప్పుకొచ్చారు.