https://oktelugu.com/

Rana Daggubati: అమెజాన్ ప్రైమ్ లో రానా దగ్గుబాటి సరికొత్త టాక్ షో..మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బాక్స్ ఆఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా రానా కి ఒక ప్రత్యెకైమైన ఇమేజ్ ఏర్పడింది. ఇక బాహుబలి సిరీస్ తో ఆయనకి వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ వచ్చింది. కానీ ఆ ఫేమ్ ని ఆరోగ్య సమస్యల కారణంగా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు రానా. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన 'నేనే రాజు..నేనే మంత్రి' చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 06:18 PM IST

    Rana Daggubati

    Follow us on

    Rana Daggubati: నేటి తరం యంగ్ హీరోలలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో రానా దగ్గుబాటి. దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, తొలిసినిమా లీడర్ తోనే నటుడిగా మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, రానా కి నటుడిగా మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన కంటెంట్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ వచ్చాడు. బాక్స్ ఆఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా రానా కి ఒక ప్రత్యెకైమైన ఇమేజ్ ఏర్పడింది. ఇక బాహుబలి సిరీస్ తో ఆయనకి వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ వచ్చింది. కానీ ఆ ఫేమ్ ని ఆరోగ్య సమస్యల కారణంగా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు రానా. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.

    ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన అరణ్య, విరాటపర్వం వంటి సినిమాలు విడుదలయ్యాయి కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. కానీ ప్రధాన పాత్ర పోషించిన ‘భీమ్లా నాయక్’ మాత్రం రానా కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘వెట్టియాన్’ చిత్రంలో రానా ఒక కీలక పాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాకపోయినా, రానా స్క్రీన్ మీద ఉన్నంతసేపు రజినీకాంత్ కూడా డామినేట్ అయ్యాడు అనే టాక్ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే రానా కేవలం సినీ నటుడు మాత్రమే కాకుండా, ఒక మంచి వ్యాఖ్యాత అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది వరకు ఆయన జెమినీ టీవీ లో ప్రసారమయిన ‘నెంబర్ 1 యారి విత్ రానా’ అనే పాపులర్ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఆ టాక్ షో పెద్ద హిట్ అయ్యింది.

    ఈ టాక్ షో తర్వాత మళ్ళీ ఆయన సరికొత్త టాక్ షోతో మన ముందుకు రాబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ సంస్థ సమర్పిస్తున్న ఈ టాక్ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ ని కూడా షూట్ చేసారు. ఈ నెల 23వ తారీఖు నుండి ఈ టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. రాజమౌళి, ప్రభాస్, నాగ చైతన్య ఇలా ఎంతోమంది ప్రముఖ సెలెబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొన్నారట. మొదటి ఎపిసోడ్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు సమాచారం. ఈ టాక్ షోలో రాజమౌళి రానా తో జరిపిన సంభాషణ చాలా సరదాగా ఉంటుందట. గతంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘నెంబర్ 1 యారి’ టాక్ షో కి కూడా రాజమౌళి విచ్చేశాడు. ఈ టాక్ షో మధ్యలో వీళ్లిద్దరు ప్రభాస్ తో కూడా ఫోన్ కాల్ సంభాషణ జరిపారు. ఆ రేంజ్ లో ఈ ఎపిసోడ్ ఉంటుందా లేదా అనేది చూడాలి.