Rana And Rajamouli: దగ్గుబాటి రానా కెరీర్ లో ‘బాహుబలి’ సిరీస్ ఎంతో ప్రత్యేకం. అప్పటి వరకు హీరో గా కొనసాగిన రానా లో క్రూరమైన విలనిజం చూపించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత రానా కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీ ని దున్నేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించేసాడు. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన హీరో గా నయించిన ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఆయన కేవలం క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం. అరణ్య, విరాట పర్వం వంటి సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, అవి కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి.
దీంతో ఆయన క్యారక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. ఇదంతా పక్కన పెడితే రానా దగ్గుబాటి మరోసారి దర్శక ధీరుడు రాజమౌళి తో చేతులు కలపబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రాజమౌళి త్వరలో మహేష్ బాబు తో సినిమా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రానా మాసాయి తెగకు సంబంధించిన ఒక పవర్ ఫుల్ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుందట. ఇప్పటికే భల్లాలదేవ క్యారక్టర్ తో రానా అద్భుతమైన విలనిజం ని పండించాడు. ఈ చిత్రం లో ఆయన పాత్ర అంతకంటే కర్కశంగా ఉంటుందట. గత కొంతకాలం నుండి రాజమౌళి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నాడు. ఈ వర్క్ షాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటుగా, రానా కూడా పాల్గొంటున్నాడని వినిపిస్తుంది. ఆయన లుక్ కి సంబంధించిన టెస్టులు కూడా నిర్బహించారట. అయితే రానా ని అభిమానించే దగ్గుబాటి అభిమానులు మాత్రం రానా వరుసగా ఇలా విలన్ రోల్స్ చేస్తుండడంతో కాస్త నిరాశకు గురి అవుతున్నారని తెలుస్తుంది.
బాహుబలి సిరీస్ తో నెగటివ్ రోల్స్ ఆపేసి ఉండుంటే బాగుండేది అని, కానీ రీసెంట్ గా ఆయన రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం లో విలన్ పాత్రలో కనిపించడం అసలు ఏమాత్రం బాగాలేదని, విలన్ క్యారక్టర్ లో కనిపించినప్పటికీ బాహుబలి తరహాలో, లేదా భీమ్లా నాయక్ తరహాలో ఉండుంటే బాగుంటుందని, కానీ వెట్టియాన్ చిత్రం లో ఆయన రెగ్యులర్ విలన్ రోల్ ని చేసాడని, అది ఆయన కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడదని, రేపు రాజమౌళి సినిమాలో చేయబోయే విలన్ క్యారక్టర్ అలా ఉన్నట్టు అయితే వెంటనే తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం మలయాళం హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపించాయి,మళ్ళీ అదే సినిమాలో ఇంకో విలన్ క్యారక్టర్ అంటే కచ్చితంగా ప్రాధాన్యత లేనిదే అని రానా అభిమానులు ఫీల్ అవుతున్నారు.