https://oktelugu.com/

Viswam OTT: విడుదలైన వారం రోజుల లోపే ఓటీటీలోకి గోపీచంద్ ‘విశ్వం’..ఎందులో చూడాలంటే!

ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయాలి. అంటే అక్టోబర్ 29 , లేదా నవంబర్ 3 వ తారీఖున ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే సినిమా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ విడుదల తేదీ లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే ప్రమాదం ఉందని ట్రేడ్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 07:01 PM IST

    Viswam

    Follow us on

    Viswam OTT: గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం విశ్వం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో, బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు, కారణం అటు హీరో గోపిచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల, ఇద్దరూ ఫ్లాప్ ఫేస్ లో ఉన్నారు. గోపీచంద్ కి అయినా ఈమధ్య కాలం లో ఒకటి రెండు పర్వాలేదు అని అనిపించే సినిమాలు పడ్డాయి కానీ, శ్రీను వైట్ల హిట్ సినిమాని తీసి పదేళ్లు దాటింది. ఎన్టీఆర్ తో చేసిన ‘బాద్ షా’ చిత్రం తర్వాత ఆయన కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. 2018 లో రవితేజ తో ఆయన తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

    ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. భారీ గ్యాప్ తీసుకొని విశ్వం చిత్రం తో మన ముందుకు వచ్చాడు. రొటీన్ చిత్రం అనిపించినప్పటికీ, కామెడీ వర్కౌట్ అవ్వడంతో దసరా హాలిడేస్ వరకు నెట్టుకొచ్చింది. నేడు కూడా కొన్ని ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది ఈ చిత్రం. ఇదే స్థాయిలో ఈ వీకెండ్ వరకు కొనసాగితే గోపిచంద్ కెరీర్ లో భారీ హిట్ పడినట్టే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గోపీచంద్ హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి, అందుకే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేట్ కి కొనుగోలు చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయాలి. అంటే అక్టోబర్ 29 , లేదా నవంబర్ 3 వ తారీఖున ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే సినిమా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ విడుదల తేదీ లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే ప్రమాదం ఉందని ట్రేడ్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈమధ్య కాలం లో ఇది ప్రతీ సినిమాకి సాధారణం అయిపోయింది, పెద్దగా ప్రభావం ఏమి చూపడం లేదు కాబట్టి ఓటీటీ తేదీ లీక్ అయినా ప్రమాదం లేదని నిర్మాతలు భావిస్తున్నారట. వరుస ఫ్లాప్స్ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా ‘విశ్వం’ చిత్రం నిల్చింది.