https://oktelugu.com/

Jani Master: మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్…వీళ్ళు అమ్మాయిల కేసుల్లో ఇరుకున్నారా.? ఇరికించారా.? ఈ విషయంలో తప్పు ఎవరిది..?

ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సెలబ్రిటీలందరి కెరియర్లకి చాలా వరకు ప్రమాదమైతే పొంచి ఉంది. నిజానికి వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కూడా ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. అందుకే ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సినీ పెద్దలు సైతం ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్స్ ను హెచ్చరిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 14, 2024 / 06:35 PM IST

    Jani Master(5)

    Follow us on

    Jani Master: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే విపరీతంగా కట్టుబడి ఎలాగైనా సరే మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఇక ఇలాంటి సందర్భంలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు చేసిన కొన్ని ఇల్లీగల్ పనుల వల్ల తెలియా కుండానే వాళ్ల కెరియర్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్… అయితే ఈయన లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడంటూ ఆమె గత కొద్దిరోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇక దాంతో ఆయన చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులు గమనిస్తూ వస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జానీ మాస్టర్ కూడా తన అసిస్టెంట్ అయిన శ్రేష్టి రావు అనే అమ్మాయి మీద సెక్సువల్ ఎటాక్ చేశాడని ఆమె కంప్లైంట్ చేసింది. దాంతో జానీ మాస్టర్ మీద కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. ఇక తనకు వచ్చిన ‘నేషనల్ అవార్డు’ని కూడా రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…

    ఇలా చాలామంది అమ్మాయిలు ప్రస్తుతానికి మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ల ను వాడుకొని ఏదో విషయం లో వాళ్లకు ఇబ్బంది కలగడంతో పాలన హీరో లేదంటే డ్యాన్స్ మాస్టర్ మా మీద సెక్సువల్ గా ఎటాక్ చేశారు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది.

    నిజానికి ఈ విషయం లో మగాళ్ళ తప్పు ఎంత ఉందో ఆడవాళ్ళ తప్పు కూడా అంతే ఉంది. ఎందుకంటే పలాన హీరోతో, మాస్టర్ తో వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి మొదటి రోజే తెలుసు అయిన కూడా ఎందుకు దాన్ని ప్రోత్సహించారు. మొదట్లోనే ఈ విషయాలను పోలీసుల పరిధిలోకి తీసుకెళ్తే బాగుండేది కదా అంటు మరి కొంతమంది లావణ్య, శ్రేష్టి ల మీద నెగటివ్ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ అమ్మాయిల వాళ్ళకు అన్యాయం జరిగిందని కాదు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ సెలబ్రెటీల జీవితాలని నాశనం చేస్తున్నారు.

    నిజంగా ఆ సెలబ్రిటీలు తప్పు చేస్తే మొదట్లోనే ఖండించాల్సింది. అప్పుడు డబ్బులు తీసుకొని సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు మాత్రం సెలబ్రెటీల్లా వెలుగొందుతున్న వాళ్ల స్టార్ డమ్ మీద దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే ఇలాంటి ఒక దుష్ప్రచారానికి దిగుతున్నారు అంటూ మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం వాళ్ల మీద విమర్శలను గుప్పిస్తున్నారు…