https://oktelugu.com/

Rana Daggubati: భార్య మిహికాను వీడియో తీస్తుండగా తిరుపతిలో రానా ఏం చేశాడో తెలుసా?

Rana Daggubati: దగ్గుబాటి వారసుడు రానా. లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి రెండు వసంతాలు పూర్తి చేసుకున్నారు. అయితే వారి దాంపత్య జీవితంపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని వదంతులు వ్యాపించాయి. సాధారణంగా బహిరంగంగా తన గురించి ప్రచారం ఇష్టపడని రానా వదంతులకు చెక్ పెట్టాడు. తన జీవిత భాగస్వామితో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని అందరి అనుమానాలకు తెర దించాడు. తనదైన శైలిలో నటిస్తూ పలు పాత్రల్లో జీవిస్తున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవుడిగా రానా నటనకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2022 / 09:32 AM IST
    Follow us on

    Rana Daggubati: దగ్గుబాటి వారసుడు రానా. లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి రెండు వసంతాలు పూర్తి చేసుకున్నారు. అయితే వారి దాంపత్య జీవితంపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని వదంతులు వ్యాపించాయి. సాధారణంగా బహిరంగంగా తన గురించి ప్రచారం ఇష్టపడని రానా వదంతులకు చెక్ పెట్టాడు. తన జీవిత భాగస్వామితో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని అందరి అనుమానాలకు తెర దించాడు. తనదైన శైలిలో నటిస్తూ పలు పాత్రల్లో జీవిస్తున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవుడిగా రానా నటనకు మంచి మార్కులే పడ్డాయి. భీమ్లానాయక్ లో పవన్ కల్యాణ్ తో నటించి ఔరా అనిపించుకున్నాడు. దీంతో సినిమాల్లో మంచి పాత్రలు ఎంచుకుని తన సత్తా చాటుతున్నాడు.

    Rana Daggubati

    రానా దంపతుల మధ్య ఏవో గొడవలు జరిగినట్లు ఇద్దరు విడాకులు తీసుకోనున్నట్లు పలు ప్రచారాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వీటిని సునిశితంగా పరిశీలించిన రానా వారికి తగిన సమాధానం చెప్పాలని అనుకున్నాడు. వారి ప్రశ్నలకు తొందర పడలేదు. కానీ భార్యను తీసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని అందరిని ఆశ్చర్యపరచాడు. తమ బంధంపై వస్తున్న ఆరోపణలకు తనదైన శైలిలో చెక్ పెట్టాడు. రానా భార్య మిహికా బజాజ్ తో కలిసి తిరుమలలో సందడి చేశాడు. సోషల్ మీడియాలో తమ ఫొటోలు డిలీట్ చేయడంతో అందరిలో అనుమానాలు వచ్చాయి.

    Also Read: Roja Daughter: స్టార్ హీరో వారసుడితో రోజా కూతురు రొమాన్స్… ఇది ఫిక్స్ అంటున్నారుగా!

    తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకొచ్చిన రానా తో ఫొటోలు దిగడానికి అభిమానులు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. ఎంతగా వారించినా వారు తగ్గలేదు. రానా భార్య మిహికాను సైతం ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో రానాకు ఆగ్రహం వచ్చింది. దీంతో ఓ అభిమాని ఫోన్ లాక్కోవడంతో అందరు కంగుతిన్నారు. తరువాత నవ్వుకున్నారు. అభిమానులు చేసిన పనికి సహనం నశించడంతో అలా చేయాల్సి వచ్చిందని అందరు భావించినా రానా తరువాత వారికి వివరించారు. తిరుమలలో ఫొటోలు తీసుకోవడం నిషేధం అని తెలిసినా అభిమానులు చేసిన పనికి ఇలా చేయడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    Rana Daggubati

    రానా భీమ్లా నాయక్, విరాట పర్వం సినిమాల తరువాత మార్తాండ వర్మ చిత్రం ద్వారా అలరించనున్నాడు. 18వ శతాబ్దంలో ట్రావెంకోర్ రాజుకు సంబంధించిన చారిత్రక కథాంశంతో తెరకెక్కేసినిమాలో నటించనున్నాడు. ప్రసార మాధ్యమాల ప్రభావం పెరగడంతో ఏవో గాసిప్స్ రావడంతో సెలబ్రిటీలు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రానా దంపతుల విషయంలో అనవసర వదంతులు క్రియేట్ చేస్తూ ఇలాంటి చౌకబారు పద్ధతుల్లో వ్యక్తిగత జీవితాను టార్గెట్ చేసుకోవడం సమంజసం కాదని తెలిసినా వారిలో మార్పు రావడం లేదు.

    Also Read:Sunny Leone: తెలుగు వారికి అందాల కనువిందు.. సన్నిలియోన్ హాట్ పిక్స్ భలే పసందు 

    Recommended videos:

    Tags