https://oktelugu.com/

రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!

కరోనా కారణంగా ఈ ఇయర్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నది. సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. కోట్లు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్‌ కాకుండా ల్యాబ్స్‌లో ఉండడంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు నాలుగు గోడలకు పరిమితమయ్యారు. ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఇంత ఇబ్బంది పడుతున్న టైమ్‌లో కొన్ని శుభకార్యాలకు మాత్రం సమయం దొరికింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 08:24 PM IST
    Follow us on


    కరోనా కారణంగా ఈ ఇయర్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నది. సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. కోట్లు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్‌ కాకుండా ల్యాబ్స్‌లో ఉండడంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు నాలుగు గోడలకు పరిమితమయ్యారు. ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఇంత ఇబ్బంది పడుతున్న టైమ్‌లో కొన్ని శుభకార్యాలకు మాత్రం సమయం దొరికింది. పలువురు యువ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నారు. నిఖిల్‌, నితిన్‌ ఇప్పటికే ఓ ఇంటివాళ్లయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాడు. రీసెంట్‌గా యంగ్‌ డైరెక్టర్ సుజీత్‌ పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు రానా వంతు వచ్చింది. తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను రానా.. పెద్దల సమక్షంలో ఈ నెల 8వ తేదీన వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్ధం జరిగింది. బిజినెస్‌ ఫ్యామిలీకి చెందిన మిహీకాతో ప్రేమ విషయాన్ని మేలో బయటపెట్టాడు రానా. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది.

    Also Read: పాపకు మేకప్ ఒక్కటే కాదు, టెక్కు కూడా ఎక్కువే !

    హై ప్రొఫైల్‌ ఫ్యామిలీ కావడంతో రానా- మిహీకా పెళ్లిపై అందరి దృష్టి నిలిచింది. కరోనా ప్రభావం లేకపోతే ఈ వివాహాన్ని ఆకాశంత పందిరి వేసి అన్న సినిమాటిక్‌ రేంజ్‌లో చేసేది దగ్గుబాటి ఫ్యామిలీ. వధువు సంప్రదాయం ప్రకారం రోకా వేడుక, ఆపై ఎంగేజ్‌మెంట్‌ జరిగినా.. కరోనా ప్రభావం తగ్గాక ఘనంగా పెళ్లి చేద్దామని కొంతకాలం వేచి చూసింది. కానీ, జూలై పోయి ఆగస్టు వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి కనిపించేలా లేకపోవటంతో ఆగస్టు 8న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తొలుత నితిన్‌ పెళ్లి జరిగిన ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో భారీగా పెళ్లి వేడుక నిర్వహించాలని భావించినా తర్వాత వెనుకడుగు వేశారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అతిథుల సంఖ్యలను వీలైంతన కుదించాలని నిర్ణయించారు. పెళ్లిని కూడా రోకా వేడుక నిర్వహించిన రామానాయుడు స్టూడియోస్‌లోనే అది కూడా ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితుల సమక్షంలో జరపాలని డిసైయ్యారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌ కాకుండా అతి కొద్దిమంది అతిథులు మాత్రమే పెళ్లికి హాజరు కానున్నారు. ఆ అతిథుల్లో కూడా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో అక్కినేని ఫ్యామిలీ మాత్రమే ఉంటుందని సమాచారం.

    Also Read: నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!

    మొత్తంగా 30 మంది సమక్షంలో పెళ్లి వేడుక జరుగుతుందని, కనీసం క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు కూడా ఆహ్వానం పలుకలేదని దగ్గుబాటి సురేశ్‌ బాబు చెబుతున్నాడు. కరోనా టైమ్‌లో ఆడంబరాలకు దూరంగా ఉండాలని, ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టకుండా పది మందికి ఉదాహరణగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు పెళ్లి జరిగే ప్రాంతంలో బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌ ఏర్పాటు చేసి అత్యంత సురక్షితంగా మార్చుతామని తెలిపాడు. పెళ్లి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు కూడా నిర్వహిస్తామని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తామని సురేశ్‌ బాబు వెల్లడించాడు. పెళ్లికి ముందు వధూవరుల కుటుంబాల సంప్రదాయం ప్రకారం జరిగే ఇతర వేడుకల్లో మాత్రం మార్పు లేదు. పెళ్లికొడుకు పంక్షన్‌, హల్దీ, మెహింది, మాతా కి చౌకి (ఉత్తరాది వేడుక) కూడా నిర్వహించనున్నారు.