Rana Super Words about Dulquer Salmaan: మలయాళం సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మమ్ముట్టి (Mammootty) ఆయన తీసిన ప్రతి సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తన కొడుకు అయిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సైతం చిన్నచిన్న సినిమాలను చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. అన్ని భాషల్లో సినిమాలను చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తెలుగులో సైతం మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాడు. దుల్కర్ సల్మాన్ కి ఏ మాత్రం ఈగో ఉండదని ఆయనకు చాలా పేషెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని రానా ఈ ఈవెంట్లో తెలియజేశాడు. ఇక దానికి సంబంధించిన ఒక సంఘటనని కూడా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది… దుల్కర్ సల్మాన్ ఒక హిందీ సినిమా చేస్తున్నప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేయాల్సి వచ్చిందట…ఇక దానికి తగ్గట్టుగానే రానా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఆ షూట్ కి రానా వెళ్ళారట… అక్కడ షూటింగ్ జరుగుతున్నంత సేపు దుల్కర్ సల్మాన్ ఎండలో నిల్చొని ఉన్నారట. ఇక హిందీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న నటి ఇందులో హీరోయిన్ గా చేస్తుందట. ఆమె షూట్ జరుగుతున్నప్పుడే తన భర్తతో ఫోన్ మాట్లాడుతుందట…అది అంత ఇంపార్టెంట్ విషయం కూడా కాదట.. ఆయన దుబాయిలో షాపింగ్ చేస్తుంటే దానికి సంబంధించిన విషయం మాట్లాడుతుందట…ఇక షాట్ కి రాకుండా డిలే చేస్తూ వస్తుందట…దాంతో పాటుగా రానా వెళ్లిన తర్వాత ఆయనను చూసి ఆయనతో కూడా పరిచయం చేసుకుంటుందట. అది గమనించిన రానా పరిచయాలు తర్వాత ముందు అక్కడ షూట్ నడుస్తుంది అక్కడికి వెళ్లి షూట్ లో పాల్గొనండి అని చెప్పాడట. అక్కడికి వెళ్లి చాలాసేపు డైలాగులు సరిగ్గా చెప్పకుండా టేకుల మీద టేకు లు తీసుకొని విసిగిస్తుందట…
Also Read: కాంతార చాప్టర్ 1 మూవీ పోస్టర్ వేరేలేవల్ ఉందిగా… రిషబ్ శెట్టి మరో హిట్ కొట్టబోతున్నాడా..?
ఇక మొత్తానికైతే అప్పటినుంచి షాట్ అయిపోయేంత వరకు దుల్కర్ సల్మాన్ చాలా కూల్ గా పేషెంట్స్ తో ఉన్నారట. ఇక సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు కారులలో తన స్టాఫ్ తో కలిసి ఆ హీరోయిన్ వెళుతుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం ఒక ఇనోవా కారులో చాలా సింపుల్గా వెళ్లిపోయారట.
అది చూసిన రానా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి వారిని తిట్టాడట…నిజానికి దుల్కర్ సల్మాన్ లాంటి హీరో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా సరే అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం… పాజిటివ్, నెగెటివ్ అనే తేడా లేకుండా ప్రతి పాత్ర ను ఎంజాయ్ చేస్తూ నటిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి ఒక వ్యక్తి మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు అయినప్పటికి ఆయనకే మాత్రం ఇగో లేదని చాలామంది చెబుతూ ఉంటారు.
ఇక మన హీరోలు కూడా అలానే ఉంటే మంచిది అని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక రానా చెప్పిన ఇన్సిడెంట్ తో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసింది. ఏది ఏమైనా కూడా దుల్కర్ సల్మాన్ విజయాలను సాధిస్తూ తన ఎంటైర్ కెరియర్ లో స్టార్ హీరోగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం…
