Kantara: Chapter 1 poster unveiled: కాంతార (Kanthara) సినిమాతో భారీ పాపులారిటిని సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty)… ప్రస్తుతం ఆయన కాంతార సినిమాకి ఫ్రీక్వెల్ గా ‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్ వన్’ అనే సినిమాని చేస్తున్నాడు. మరి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. నిజానికి ఈరోజు రిషబ్ శెట్టి బర్త్ డే అవ్వడం వల్ల ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో రిషబ్ శెట్టి చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో బల్లెం మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఒక యోధుడి లా వెలిగిపోతున్నాడు. ఇక బ్యాగ్రౌండ్ లో విస్ఫోటనానికి సంబంధించిన విజువల్స్ పోస్టర్ మొత్తానికి హైలెట్ గా నిలిచి అక్టోబర్ రెండోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. రిషబ్ శెట్టి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అందిస్తూనే సినిమాలో నటిస్తూ మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. మరోసారి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా 7 వ దశాబ్దం నాటి కదంబ రాజవంశస్తులకు చెందిన కథతో తెరకెక్కబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా మొదటి పార్ట్ కంటే కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి రిషబ్ శెట్టి స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో తను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నట్లయితే ఇండస్ట్రీలో తనకిక తిరుగు ఉండదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఇతర దర్శకుల సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయినప్పటికి ఈ సినిమా మీదనే తను ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: హరిహర వీరమల్లు మీద నెగెటివ్ ప్రచారం చేస్తుందేవరు..?
ఇక హోంబలే ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం… పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న చాలా సినిమాలు చాలా ప్రస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక అందులో అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి అదే తరహాలో కాంతర ప్రీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించి మరోసారి కన్నడ సినిమా ఇండస్ట్రీ స్టామినా ఏంటో యావత్ ఇండియన్ సినిమా ప్రపంచానికి చూపిస్తుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి…మరి ఈ సినిమాతో ఇండియాలో మరిన్ని ఇలాంటి సినిమాలు వస్తాయి అని చాలా మంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…