https://oktelugu.com/

Money Tips: మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ బీరువా ఇలా ఉండాల్సిందే!

Money Tips: వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు బీరువాకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలియజేస్తారు. మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మన బీరువా తప్పనిసరిగా ఎంతో శుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి ఏ ఇంటిలో అయిన కొలువై ఉండాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్న అందులో అమ్మవారు ఒక్క క్షణం కూడా నిలవరు. అందుకోసమే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. ఇక మనం నిత్యం మనం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2021 / 10:42 AM IST
    Follow us on

    Money Tips: వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు బీరువాకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలియజేస్తారు. మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మన బీరువా తప్పనిసరిగా ఎంతో శుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి ఏ ఇంటిలో అయిన కొలువై ఉండాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్న అందులో అమ్మవారు ఒక్క క్షణం కూడా నిలవరు. అందుకోసమే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు.

    Money Tips

    ఇక మనం నిత్యం మనం సంపాదించిన డబ్బులను దాచి ఉంచే బీరువా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువాను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే బీరువాకు ఎలాంటి పరిస్థితులలో కూడా అద్దం ఉండకూడదు. బీరువాకు అద్దం ఉంటే ఆఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. బీరువా ఉన్న అద్దం ముందు మనం నిలబడి ఎంతో అందంగా అలంకరించుకుంటాము.ఇలా అమ్మవారి ముందు మనం అలంకరించుకోవటం వల్ల అమ్మవారు ఆగ్రహించి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోతారు.

    Also Read: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్!

    అందుకోసమే బీరువాకి ఉన్న అద్దం ముందు నిలబడి అలంకరించుకోవడం ముఖ్యంగా అలాంటి బీరువాను ఇంటికి తీసుకురాకూడదు. అదేవిధంగా బీరువా లేనివారు డబ్బులను ఎప్పుడూ కూడా ఇంట్లో ఏదో ఒక చోట డబ్బులు భద్రపరుస్తారు. ఇలా డబ్బులు భద్రపరచాల్సి వస్తే ఎప్పుడు కూడా దక్షిణం, పశ్చిమ మధ్యలో ఉండే నైరుతి మూలలో డబ్బులను భద్రపరచడం వల్ల మన ఇంటికి లక్ష్మీ యోగం కలుగుతుంది.

    Also Read: రోజుకు రూ.417 పొదుపు చేస్తే రూ.కోటి మీ సొంతం.. ఎలా అంటే?