Ramya Krishnan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు చాలా వరకు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. నిజానికి ఒక క్యారెక్టర్ లో ఒక నటుడు ఎలివేట్ అవ్వాలంటే దర్శకుడు ఆ పాత్రని చాలా గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఎవరికి వారు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లినప్పుడు మాత్రమే ఇక్కడ టాప్ లెవెల్లోకి వెళ్తారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇక్కడ వాళ్లకి ఎక్కువగా రోజులపాటు కెరియర్ అయితే ఉండదనేది వాస్తవం…ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇలా ఇండస్ట్రీ కి వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. పెద్దగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రమ్యకృష్ణ లాంటి నటి సైతం ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇక ఆమె పెళ్లి చేసుకున్న కొత్తలో షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఎన్టీఆర్ తో ‘నా అల్లుడు’ అనే సినిమా చేసింది. అయితే ఆ సినిమాలో రమ్యకృష్ణ ఒక పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ కావడం అప్పుడే సినిమా షూటింగ్ లు పెట్టడంతో తను ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా దర్శక నిర్మాతలు వినలేదట.
తప్పుకుండా నువ్వు ఈ పాటలో డాన్స్ చేయాలని చెప్పడంతో ఆమె చేసేదేమీ లేక డాన్స్ చేసి మొత్తానికైతే షూటింగ్ కంప్లీట్ చేసింది. ఇక ఏది ఏమైనా కూడా ఒక పాత్రకి కమిట్ అయితే పూర్తి డెడికేషన్ తో వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆయా నటి నటులు తారస్థాయిలో వెలుగొందుతారు.
లేకపోతే మాత్రం పాతాళానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. రమ్యకృష్ణ డెడికేటెడ్ ఆర్టిస్ట్ కావడం ఉండడం వల్లే అలాంటి డ్యాన్స్ స్టెప్ లను చాలా అలవోకగా చేసేసింది. ఆమె ప్లేస్ లో మిగతావారు ఎవరున్నా కూడా మేము డ్యాన్స్ చేయము అంటూ పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యేదని ఈ సంఘటన తెలిసిన తర్వాత పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు…