Tollywood: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు మంచి కథలతో సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లో సాధించిన విషయం మనకు తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో కథలేమి పెద్దగా ఉండడం లేదు… దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు సైతం సినిమాల కథల గురించి పట్టించుకోవడం మానేసారు. వాళ్లను రెండున్నర గంటలపాటు ఎంటర్టైన్ చేస్తే సరిపోతోంది అనే ధోరణిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు ఆయా సినిమాల్లో కేవలం ఎలివేషన్ సీన్స్ ని మాత్రమే పెట్టుకొని ఆ ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ దానికి సరైన బ్యా గ్రౌండ్ మ్యూజిక్ ని కొట్టించుకొని మరి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు అలానే సూపర్ సక్సెస్ ని సాధించాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే ఇలాంటి సినిమాలని ఒకసారి కంటే ఎక్కువగా చూడలేము.
అదే ఒక మంచి కథతో ప్యూర్ ఎమోషన్ తో అందులోనే కొన్ని ఎలివేషన్స్ కలుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాటిని ఆడియన్స్ రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూనే బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి ఆలోచించుకొని మరోసారి ఆ మూవీ చూస్తే బాగుండు అనిపించే రేంజ్ లో సినిమా ఉండాలి.
అలా ఉన్నప్పుడే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. అలా కాకుండా ఏదో తీశాము అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద మైనస్ అవుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ ఇలాంటి హైప్ తోనే రావడం తో సగటు ప్రేక్షకుడికి సినిమాలు చూసే ఆసక్తి కూడా పోతోంది.
కాబట్టి ఏదైనా మంచి కథ ఉంటే ఆ సినిమాలో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాల్లో అయిన మన దర్శక నిర్మాతలు మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…