Chiranjeevi – Ramya Krishna: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో కూడా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించబోతుంది. ఆమె పాత్ర గతంలో చిరును ప్రేమించి, కొన్ని కారణాల వల్ల దూరమైన పాత్ర అట. ఎమోషనల్ గా నడిచే పాత్ర అని కూడా తెలుస్తోంది. రమ్యకృష్ణ హీరోయిన్ గా చిరుతో సినిమాలు చేసింది. మరీ ఇప్పుడు సైడ్ పాత్రలకు కూడా సిద్ధం అయింది మేకర్స్ బాహుబలి నుంచి రమ్యకృష్ణకు మంచి పాత్రలు ఇస్తున్నారు.
లైగర్ లో కూడా రమ్యకృష్ణనే హైలైట్ కానుందట. పవర్ ఫుల్ మదర్ గా ఆమె చాలా బాగా నటించింది. గాడ్ ఫాదర్ లో కూడా ఆమె పాత్ర చాలా కీలకం అట. ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, పక్కా విలన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుందని తెలుస్తోంది. ఎలాగూ రమ్యకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి.
Also Read: Hansika: దేశముదురు భామ ‘హన్సిక’ అంగాంగ ప్రదర్శన.. అందాల విందు వైరల్
దర్శకుడు మోహన్ రాజా కూడా అందుకు తగ్గట్టుగానే రమ్యకృష్ణ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. అలాగే స్క్రిప్ట్ లో కూడా మోహన్ రాజా చాలా మార్పులు చేశాడు. రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా స్క్రిప్ట్ లో వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా కథలో కొన్ని పాత్రలను యాడ్ చేసినట్లు సమాచారం. మరి రమ్యకృష్ణ ఏ పాత్రలో నటిస్తోందో చూడాలి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. స్పోర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా స్టైల్ గా కుర్చీలో కూర్చొని, నలుపు షేడ్స్ లో కనిపించిన చిరు గెటప్ అండ్ సెటప్ వెరీ పవర్ ఫుల్ గా ఉంది. ఒక్క మాటలో చిరంజీవి పాత్రకు సంబందించిన ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ అద్భుతంగా ఉంది.
మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read:Hero Nithin: బుల్లితెర సీరియల్స్ లో నటించబోతున్న హీరో నితిన్