Ramya Krishna Assets: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగే కెపాసిటీ దర్శకులకు మాత్రమే ఉంది. డైరెక్టర్ ముందుగానే తన మైండ్ లో సినిమాను చూసేసి దానిని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెర మీద ఆవిష్కరిస్తాడు. ఒక దర్శకుడి యొక్క విజన్ కి కట్టుబడి 24 క్రాఫ్ట్ ల టెక్నీషియన్స్ పని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజానికి డైరెక్టర్లలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా కృష్ణవంశీ అన్ని జానర్స్ లో సినిమాలను చేస్తూ ఉంటాడు. ఆయన సినిమా పోస్టర్లను చూసి సినిమా ఏ విధంగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయడం కష్టమని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన డైరెక్టర్ కూడా కృష్ణవంశీ గారే కావడం విశేషం…ఇక సినిమా కెరియర్ ను పక్కన పెట్టి పర్సనల్ విషయాల్లో వెళ్తే ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ అయిన రమ్య కృష్ణ ను తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…
ప్రస్తుతం రమ్యకృష్ణ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో టాప్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇప్పటివరకు 250 కోట్లకు పైన ఆస్తులను సంపాదించింది. ఇక ఆ లెక్కన రమ్య కృష్ణ సంపాదించిన ఆస్తుల కంటే కృష్ణవంశీ ఆస్తులు చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి. కృష్ణవంశీ ఇప్పటివరకు సినిమాల ద్వారా 150 కోట్ల వరకు ఆస్తులనైతే పోగేసుకున్నాడు.
అలాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ 30 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కేవలం 150 కోట్లను మాత్రమే సంపాదించాడు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి కృష్ణవంశీ పెద్దగా బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ అయితే చేయడు. తను కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేసి తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతాడు. అందుకే అతను ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలను చేయలేకపోయాడు…
ఒకవేళ ఆయన స్టార్ హీరోలతో సినిమాలను చేసినట్టయితే వందల కోట్ల రూపాయలను సంపాదించుకునేవాడు. కానీ కృష్ణ వంశీ తన ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే సినిమాలను చేశాడు. అందుకే మీడియం హీరోలతో సక్సెస్ లను సాధించి వాళ్లకు ఒక లైఫ్ ను ఇచ్చాడు… ఇక స్టార్ హీరోలతో సినిమాలను చేస్తే వాళ్లు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారనే ఉద్దేశంతో కృష్ణవంశీ పెద్దగా స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు…