Mowgli Plus And Minus Points: ‘ కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి యంగ్ డైరెక్టర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ డైరెక్టర్లు వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటున్నారు… కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా నేషనల్ అవార్డుని అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా వచ్చిన మోగ్లీ సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్నప్పటికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ నైట్ నుంచే వేశారు… ఇక ఈ సినిమాను రొటీన్ ప్రేమ కథతో తెరికెక్కించినప్పటికి ట్రీట్మెంట్లో తగు జాగ్రత్తలైతే తీసుకున్నాడు దానివల్ల సినిమా ఫ్రెష్ గా అనిపించింది…
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ లో బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ని ఎక్స్ట్రాడినరీగా తీర్చి దిద్దిన సందీప్ రాజ్ ఆ పాత్ర ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు…ఇక ఈ సినిమాని రాముడు, సీత, రావణాసురుడు పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కించినప్పటికి సినిమాలో కోర్ ఎమోషన్ మాత్రం చాలా వరకు మిస్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో అసలు ఎమోషన్ అనేది ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఇక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ చిగురించిన సన్నివేశాలను సైతం ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది…
ఇక ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలకి ఇటు హీరో – హీరోయిన్ మధ్య స్ట్రాంగ్ సన్నివేశాలు ఉండాలి. అలాగే ఇద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కూడా సినిమాకి బలాన్నిస్తాయి. కాన్ఫ్లిక్ట్ చాలా టైట్ గా ఉన్నప్పుడే హీరో చేసే పోరాటాలకి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు…
మొత్తానికైతే మోగ్లీ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలని సందీప్ రాజ్ చాలా వరకు ప్రయత్నం చేశాడు. కొన్ని విషయాల్లో ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు అనే విషయం మనకు అర్థమయిపోతుంది. ముఖ్యంగా బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. హీరో, వైవా హర్ష మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకునే డిస్కషన్ బాగుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా ఉంది.
ఇక బండి సరోజ్ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఆకు రౌడీని కాదు, ఆంటీ హీరో అంటూ ఆయన చెప్పిన మాటలు గత రెండు రోజుల నుంచి వైరల్ గా మారాయి. ఇక తను చెప్పినట్టుగానే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ వే లో ఉండటం వల్ల విలన్ అంటే ఇలానే ఉంటాడా? అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ప్రేక్షకుడికి కలుగుతోంది…