Girl false POCSO case: తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే. దానివల్ల ఎదుటివారి జీవితాలు తలకిందులు అవుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఊహించనివిధంగా మారిపోతుంటాయి. వాస్తవానికి ఈ తరహా సంఘటనలు సినిమాలోనే జరుగుతాయని.. నిజ జీవితంలో అలాంటివి జరగడానికి అవకాశం ఉండదని చాలామంది అనుకుంటారు.. కానీ అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే నేటి కాలంలో గిట్టని వారి మీద కావాలని కేసులు పెడుతున్నారు. దొంగ సాక్షాలు.. తప్పుడు ఆధారాలు సృష్టించి నరకం చూపిస్తున్నారు.. అటువంటి సంఘటన ఇది కూడా..
అది హర్యానా రాష్ట్రం.. ఆ బాలుడు ఓ కాలేజీలో చదువుతున్నాడు.. వాస్తవానికి అతనికి తోటి వారికి సహాయం చేయాలనే గుణం ఉంటుంది. పరోపకారమే మంచిదనే తత్వం ఉంటుంది. అందువల్లే ఆ బాలుడిని ఆ కాలేజీలో అందరూ ఇష్టపడుతుంటారు. అయితే ఆ బాలుడు చేసిన ఓ పని చివరికి తన జీవితాన్ని నాశనం చేసింది. వాస్తవానికి మంచి చేయాలని అతడు వెళ్తే చెడు ఎదురయింది. దీంతో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
ఆ బాలుడు చదువుతున్న కాలేజీలోనే ఓ బాలిక చదువుతోంది.. ఆ బాలికకు ఈ బాలుడికి మంచి స్నేహం ఉంది.. అయితే ఆ బాలిక చూసేందుకు అందంగా ఉండడంతో.. ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పాడు. తన ప్రేమలో పడేశాడు. అతని మైకంలో ఆ అమ్మాయి చదువులను దూరం పెట్టింది.. శారీరక సుఖానికి అలవాటు పడింది. ఈ విషయం ఈ బాలుడికి తెలిసింది. దీంతో ఆమెను అతడు నిలదీశాడు. అంతేకాదు ఆ యువకుడితో ప్రేమ వద్దు అన్నాడు.. ఈ వయసులో శారీరక సుఖానికి అలవాటు పడితే తర్వాత అనేక రకాల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. స్నేహితుడని మాట్లాడుతుంటే.. తన ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని.. తన ప్రియుడిపై అబాండాలు వేస్తున్నాడని భావించిన ఆ బాలిక.. తీవ్ర అగ్రహానికి గురైంది.. అంతేకాదు ఒక ప్లాన్ ప్రకారం ఆ బాలుడిని తన వద్దకు రప్పించుకొని.. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.. ఆ బాలిక చెప్పిన ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలుడు పై ఫోక్సో కేసు నమోదు చేశారు.. దీంతో ఆ బాలుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు.. ఇటీవల కేసు విచారణ సందర్భంగా అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆ బాలుడిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది.. అయితే ఏడాదిపాటు ఆ బాలుడు జైల్లో నరకం చూశాడు.. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన స్నేహితురాలని కాపాడే ప్రయత్నం చేసిన అతడు.. చివరికి జైలుకు వెళ్లాడు.. చేయని తప్పుకు ఏడాదిపాటు శిక్ష అనుభవించిన అతడికి పాత జీవితాన్ని ఎవరు ఇస్తారు.. అబద్ధం చెప్పిన ఆ బాలికకు శిక్ష ఎవరు వేస్తారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలను ఆ బాలుడి తల్లిదండ్రులు వేస్తున్నారు.. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు?