Ramu Rathod Bigg Boss 9: మరో రెండు రోజుల్లో స్టార్ మా ఛానల్ లో మొదలు కానున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున మొత్తం మీద 15 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలకు పంపబోతున్నారు. అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది అగ్నిపరీక్ష లోని సామాన్యులు ఉన్నారు. అయితే 9 మంది సెలబ్రిటీలలో ఆడియన్స్ ప్రత్యేకంగా ఆకర్షించిన సెలబ్రిటీ రాము రాథోడ్(Ramu Rathod). ఈయన పేరు సాధారణ ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి సుపరిచితమైన పేరు ఇది. యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడడం లో సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు ఈయన కంపోజ్ చేసిన పాటల్లో ‘రాను బొంబాయికి రాను’, ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటలు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి.
యూట్యూబ్ లో ‘రాను బొంబాయి కి రాను’ పాటకు 513 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ రోజుకి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట తర్వాత ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటకు 302 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ రెండు పాటల ద్వారానే ఆయన కోట్ల రూపాయిలు సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ఆరేళ్ళు రామ్ రాథోడ్ ఏ పని చెయ్యక్కర్లేదు. ప్రతీ నెల ఈ రెండు పాటల నుండి వచ్చే డబ్బులతోనే ఆయన జీవితం గడిపేయొచ్చు. అంతటి సెన్సేషన్ సృష్టించిన పాటలను అందించిన ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఒక్కో వారానికి ఈయనకు మూడు లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ని ఇచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం అంగీకారం తెలిపింది అట. అంటే రోజుకి 40 వేల రూపాయిల పైమాటే. రామ్ రాథోడ్ బయట ఉంటే ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి డబ్బులను సంపాదించవచ్చు. కానీ అలా కాకుండా బిగ్ బాస్ కి తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడం లో తప్పు లేదని అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. తన అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వచ్చిన రామ్ రాథోడ్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాడు అనేది చూడాలి.