https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. అప్పటివరకు నో ఆల్కహాల్..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల సంఖ్యలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పూర్తైంది. మార్చి నెల నుంచి వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రైవేట్ వైద్య సిబ్బందికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. Also Read: కరోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2021 5:48 pm
    Follow us on

    Corona Vaccine

    దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల సంఖ్యలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పూర్తైంది. మార్చి నెల నుంచి వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రైవేట్ వైద్య సిబ్బందికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

    Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఎనిమిది మందిలో ఒకరు మృతి..?

    తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వ్యాక్సిన్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకోకూడదని చెబుతున్నారు. శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పై ఆల్కహాల్ ప్రభావం చూపుతుందని వెల్లడిస్తున్నారు. 45 రోజుల వరకు మద్యం తీసుకోకూడదని మద్యం తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందవని అన్నారు.

    Also Read: ఈ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదా..?

    కరోనా వ్యాక్సిన్ ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందాలని భావిస్తే మాత్రం ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. నేషనల్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే వ్యాక్సిన్ ను తీసుకున్న వారు 45 రోజుల పాటు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ కు దూరంగా ఉండాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. నివేదికల ప్రకారం కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తరువాత యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    వ్యాక్సిన్ త్వరలో తీసుకోబోయే వారు సైతం ఆల్కహాల్ కు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. త్వరలో ఈ వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.