Homeఅప్పటి ముచ్చట్లుMegastar Chiranjeevi: మెగా స్టార్ బ్లాక్ బస్టర్ 'స్టేట్ రౌడీ' సినిమాని తొక్కేయాలని చుసిన పెద్ద...

Megastar Chiranjeevi: మెగా స్టార్ బ్లాక్ బస్టర్ ‘స్టేట్ రౌడీ’ సినిమాని తొక్కేయాలని చుసిన పెద్ద న్యూస్ పేపర్ అదేనట !

Ramoji Rao- Megastar Chiranjeevi: అవి మెగాస్టార్ చిరంజీవి ‘స్టేట్‌రౌడీ’ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న రోజులు. చెన్నైలో ఈ సినిమా ఓపెనింగ్ అట్ట‌హాసంగా చేశారు. ఈ వేడుకకు అప్పటి తెలుగు త‌మిళ సినీ అతిర‌థ మ‌హార‌థులంతా వచ్చారు. పైగా అప్పట్లో విచిత్రంగా భావించిన మరో అంశం ఈ సినిమా ఓపెనింగ్ కి అప్పటి రాజ‌కీయ, పారిశ్రామిక రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీలు కూడా రావడం.

state-rowdy-movie

ఒక సినిమా ఓపెనింగ్ కి రాజ‌కీయ, పారిశ్రామిక అతిర‌థ మ‌హార‌థులు ఎందుకు వచ్చారు ? అని మీడియా కూడా ఆశ్చర్యపోయింది. అయితే.. వారంతా రావడానికి కారణం.. క‌ళాబంధు టి. సుబ్బ‌రామిరెడ్డి. స్టేట్‌రౌడీ సినిమాకి ఆయనే నిర్మాత. ఇక అప్పట్లో ఈనాడు గ్రూప్‌ కు చెందిన ‘సితార’ అనే సినీ వార‌ప‌త్రికే ప్రధానమైన సినీ మీడియా. అయితే, ‘స్టేట్‌రౌడీ’ అఖండమైన ప్రారంభోత్స‌వానికి సంబంధించి సితార సినీ వార‌ప‌త్రిక‌ కేవ‌లం ఒకే ఒక్క ఫోటో మాత్రమే వేసి కవరేజ్ ఇచ్చింది.

Also Read: AP Cabinet Expansion: ఎన్నికల టీమ్ రెడీ.. పూర్తయిన కేబినెట్ కూర్పు

నిజానికి అది కావాలని చేసింది కాదు, ఆ రోజుల్లో ఎంత పెద్ద సినిమాకు అయినా కేవలం ఒక్క ఫోటో పెట్టి క‌వ‌రేజ్ చేయడమే అప్పుడు ఈనాడు ఆన‌వాయితీ. దాంతో అలాగే కవర్ చేశారు. ఇప్పుడు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, పీఆర్వోగా ఉన్న వినాయ‌క‌రావు అప్పుడు ఈనాడులో సినీ జ‌ర్న‌లిస్ట్‌ గా ఉన్నారు. కాబట్టి ఆయనే ఆ ఒక్క ఫోటో పెట్టి క‌వ‌రేజ్ ఇచ్చారు.

కట్ చేస్తే.. స్టేట్‌రౌడీ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో జరుగుతుందని వినాయ‌క‌రావుకి తెలిసింది. వెంటనే వినాయ‌క‌రావు, ఈనాడు సినీమా ఫొటోగ్రాఫ‌ర్ కుమార‌స్వామితో క‌లిసి సార‌థి స్టూడియోస్‌ కి వెళ్లారు. షూటింగ్ క‌వ‌రేజ్ కోసం వచ్చాం అంటూ చిరంజీవి గారి కోసం చుట్టూ చూస్తున్నారు. కానీ స్టేట్‌రౌడీ సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాలు చూస్తోన్న శ‌శిభూష‌ణ్ కోపంతో అరవడం మొదలుపెట్టారు.

Ramoji Rao- Megastar Chiranjeevi
Ramoji Rao- Megastar Chiranjeevi

వినాయ‌క‌రావు పై సీరియస్ అవుతూ.. ‘మేం అంత పెద్ద ఎత్తున ప్రారంభోత్స‌వం చేస్తే.. నువ్వు కేవలం ఒక ఫోటో మాత్రమే పెడతావా ? మా సినిమాకు త‌క్కువ క‌వ‌రేజ్ చేస్తావా ? అంటూ వినాయ‌క‌రావు పై ఆగ్ర‌హంగా ఊగిపోతూ బూతులు తిట్టి బయటకు చేయి చూపించి వెళ్లిపొమ్మ‌న్న‌ట్టు గట్టిగా అరిచారు. అందరూ వినాయ‌క‌రావు వైపే చూస్తున్నారు. వినాయ‌క‌రావు అవ‌మానంగా ఫీల్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోయారు.

అంతలో శ‌శిభూష‌ణ్ మనుషులు వినాయ‌క‌రావును బ‌య‌ట‌కు గెంటేశారు. రామోజీరావుగారికి ఈ విషయం తెలిసింది. వినాయ‌క‌రావుని పిలిచారు. ‘వినాయ‌క‌రావు జరిగింది విన్నాను. ఆ అవమానం నీది కాదు, నాది. నువ్వు నా మ‌నిషివి, నీకు అవ‌మానం జ‌రిగితే.. నాకు జ‌రిగిన‌ట్టే. మనం ఇక నుంచి చిరంజీవి స్టేట్‌రౌడీ సినిమాకి సంబంధించి క‌వ‌రేజ్ పూర్తిగా ఆపేస్తున్నాం. ఆ సినిమా వార్త‌లేవి ఈనాడులో ఇక రావు. ఆ సినిమాని మనం బ్యాన్ చేశాం’ అంటూ రామోజీరావు లేచి వెళ్లిపోయారు.

అయితే ఈ విష‌యం ఆ తర్వాత నిర్మాత టి. సుబ్బారామిరెడ్డిగారికి తెలిసి.. రామోజీరావుగారిని పర్సనల్ గా కలిసి మాట్లాడారు. ‘వినాయ‌క‌రావుకి జరిగిన అవమానానికి నా తరుపున క్షమాపణలు అండి’ అంటూ మళ్లీ ప్యాచ‌ప్ చేసుకున్నారు. దాంతో మ‌ళ్లీ ఆ తర్వాత ‘స్టేట్‌రౌడీ’ సినిమాకు ఈనాడు, సితార‌లో క‌వ‌రేజ్ ఇచ్చాయి. ఒకప్పుడు రామోజీరావుగారు తమ పట్ల ఇతరలు చేసే పొరపాట్లులో అంత కఠినంగా ఉండేవారు.

Also Read: Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Shocking Story: పెళ్లి తరువాత జరిగే తంతు కోసం అందరు ఉత్సాహపడుతుంటారు. తానేమిటో నిరూపించుకోవాలని కలలు కంటుంటారు. శోభనం అంటే అందరికి ఓ అద్భుతమైన ఘట్టమే. దాని కోసమే జీవితాంతం ఎదురుచూస్తుంటారు. ఆ సమయం రాగానే తమలోని ఆనందాన్ని రెట్టింపు చేసుకుని జీవితంలో మధురమైన రాత్రులను గడుపుతుంటారు. ఇక్కడ మాత్రం అతడి కలలు కల్లలే అయ్యాయి. అతడు ఊహించిందేమీ జరగలేదు. మొదటి రాత్రే భార్య భర్తను దూరం పెట్టింది. దీంతో ఆమెకు భయం ఉందేమో అనుకుని భార్యను అర్థం చేసుకుని భర్త ఆమెకు సహకరించాడు. శోభనం వాయిదా వేసుకుని ఆమె అంగీకారం కోసం రోజుల తరబడి వేయి కళ్లతో వెతకసాగాడు. […]

  2. […] Shocking Story From Patna: భార్యపై ప్రేమతో భాగ్య నగరాన్ని నిర్మించాడో చక్రవర్తి. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె కోసం తాజ్ మహల్ నిర్మించాడో చక్రవర్తి. భార్యలను అంతగా ప్రేమించిన వారు తమ జీవితంలో వారికి ఎంతో అన్యోన్యత చూపించారు. వారిని ఆరాధించారు. సర్వం అర్పించారు. అదే భార్యపై ఉన్న మమకారం. అంతటి మహోత్తర ప్రేమ చూపించిన భర్తలుండగా ఓ వ్యక్తి భార్యతోనే వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించడం చర్చనీయాంశం అయింది. దీని వెనకున్న కథ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular