https://oktelugu.com/

Ramgopal Varma : నాక్కూడా చనిపోవాలనిపించింది అంటున్నా రాంగోపాల్ వర్మ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నప్పటికి రామ్ గోపాల్ వర్మ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా కోసం ఇప్పటికి ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 08:12 AM IST

    Ramgopal Varma

    Follow us on

    Ramgopal Varma : సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలను చేసి ప్రేక్షకులందరిలో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన డైరెక్షన్ లో ఒక సరైన సినిమా అయితే రావడం లేదు. ఇక బోల్డ్ సినిమాలు పొలిటికల్ సెటైరికల్ మూవీస్ ని తప్ప ఆయన వేరే సినిమాలేవీ చేయడం లేదు. ఇక దానికి కారణం ఏదైనా కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి చాలా మంచి మేకర్ ఇప్పుడు కూడా కాన్సెంట్రేట్ చేసే సినిమా తీస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయనకు కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవాలనిపించిందని తెలియజేశాడు. నిజానికి ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అనే విషయాన్ని తెలియజేయలేదు కానీ ఒకానొక సందర్భంలో తనకు అలాంటి ఫీల్ అయితే కలిగిందని దానివల్లే అందరికి మోటివేషన్ ఇస్తూ ఉంటానని ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు అనేవి కామన్ అని చెప్పాడు. కానీ తను మాత్రం తనకు నచ్చిన లైఫ్ ని లీడ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఆయన ఏది పడితే మాట్లాడుతూ ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ హద్దులు లేని లైఫ్ ను బతకడంలో ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి.

    మరి ఏది ఏమైనా కూడా దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నమైతే చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన భారీ బడ్జెట్ తో ఒక మూవీ ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు.

    మరి ఆ సినిమా ఎవరితో చేస్తున్నాడనే విషయానికి సంబంధించిన సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ తొందర్లోనే ఒక భారీ సినిమా ఆయితే చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు…ఇక సందీప్ ఆయనకంటే అనిమల్ అని కూడా చెప్పాడు.

    ముఖ్యంగా వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారని తరచుగా కలుసుకుంటూ ఉంటారని కూడా ఆయన చెప్పడం విశేషం…ఇకఏది ఏమైనా కూడా వర్మ లాంటి లైఫ్ ని డిలీట్ చేయడం అందరివల్ల కాదని అది ఒక వర్మకే సాధ్యమని ఇప్పటికే చాలామంది మేధావులు చెప్పిన విషయం మనకు తెలిసిందే…