Kotabommali PS Review: ప్రస్తుతం తెలుగులో డిఫరెంట్ సినిమాలా ట్రెండ్ నడుస్తుంది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ గా వచ్చిన సినిమాలు కూడా చాలా మంచి విజయాలను అందుకుంటున్నాయి. దానికి ఉదాహరణగా విరూపాక్ష సినిమాని చెప్పుకోవాలి. నిజానికి విరూపాక్ష ఒక సస్పెన్స్ ట్రెండ్ కి తెరలేపింది అనే చెప్పాలి. ఇక దాని నుంచి రీసెంట్ గా వచ్చిన మంగళవారం సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ట్రెండ్ తెలుగులో ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు ఒక సినిమా వచ్చి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలి అంటే మాత్రం అది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అయితేనే బాగుంటుందని ప్రతి మేకర్ కూడా ఇప్పుడు అలాంటి సబ్జెక్టులనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు… అలా సస్పెన్స్ జానర్ లోనే తెరకెక్కిన సినిమానే ఈరోజు రిలీజ్ అయిన కోటబొమ్మాలి పి ఎస్ సినిమా… ఈ సినిమా ఎలా ఉంది శ్రీకాంత్ తన కెరియర్ లో మరొక హిట్ అందుకున్నాడా..? శివాని రాజశేఖర్ మొదటి సక్సెస్ ని అందుకుందా..? లేదా..? అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…
ఇక ముందుగా ఈ కథ విషయానికి వస్తే కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఉండే పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ చేసే వికృత చర్యల్లో అణచివేయబడి వాళ్ళు చేయని ఒక తప్పుకి బలై పోతారు ముఖ్యంగా ముగ్గురు పోలీసులు వేరే పోలీస్ లకి దొరక్కుండా ఈ ముగ్గురు పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముగ్గురు కలిసి పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడానికి వీళ్ళు ఏం చేశారు అనేదే ఈ సినిమా కథ ఇక ఈ పోలీస్ లను పట్టుకోడానికి వరలక్ష్మి శరత్ కుమార్ మరో పోలీస్ ఆఫీసర్ గా రంగంలోకి దిగి వీళ్లను పట్టుకోడానికి పరిగెడుతూ ఉంటుంది. ఇలా అత్యంత ఉత్కంఠ గా సాగే ఈ సినిమాలో అసలు పొలిటిషన్స్ చేయడం వల్ల పోలీస్ వాళ్లకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తేజ ఈ సినిమాని ఆద్యంతం ఉత్కంఠ గా తీసుకెళ్లినప్పటికీ ఈ సినిమా మాత్రం కొన్ని సీన్లలో అవుట్ ఆఫ్ ది మూవీ వెళ్లిందనే చెప్పాలి. పోలీసులను పోలీసులు తరుముతూ ఉంటే వీళ్ళు తప్పించుకుంటూ తిరగడం అనేది కోతవరకు ఫులిష్ నెస్ అనిపించినప్పటికీ పోలీసోళ్ళు ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లం ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తీసుకొని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని అయితే డిజైన్ చేసుకున్నాడు. ఇక నిజానికి ఈ సినిమా మలయాళం వచ్చిన నాయటు అనే సినిమాకి రీమేక్ గా వచ్చినప్పటికీ దానికి దీనికి చాలా మార్పులు చేర్పులు అయితే చేశారు… ఇక దర్శకుడు పోలీసు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులను చాలా డీటైల్ గా చూపించారు అదొకటి మాత్రం సినిమా కి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక అలాగే కొన్ని సీన్లలో ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతూ ఒక పోలీసోడి ప్రాబ్లం ఇలా ఉంటుందా అనే రీతిలో ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యేవిధంగా చాలా బాగా చెప్పాడు. అయితే పొలిటిషన్ చేతిలో మాత్రం పోలీసోళ్ళు నలిగిపోయే జీవితాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించాడనే చెప్పాలి. ఆధ్యాంతం చేజింగ్ ఉండడంవల్ల సినిమా ఆడియోన్స్ కి ఒక చిన్న పాటీ బోర్ ఫీల్ అనేది కలుగుతుంది.అయితే దర్శకుడు చెప్పిన పోలీస్ ల గురించి చెప్పిన విలువైన విషయాలు ఉండటం వల్ల ప్రేక్షకులు ఎంగేజ్ అవుతూ చూడ్డానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక పోలీసుల గురించి చెప్పే సీన్లు మాత్రం చాలా ఎలివేట్ అయ్యాయి అనే చెప్పాలి…. అయితే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం గ్రిప్పింగా రాసుకొని ఉంటే బాగుండేది అలా చేస్తే సినిమా ఇంపాక్ట్ అనేది మరో లెవెల్ లో ఉండేది. కథ ఎలా ఉన్నా ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీదనే సినిమా సక్సెస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అన్నదానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు..కథ బాగుంది,కానీ స్క్రీన్ ప్లే కొంతవరకు కూడా బాగున్నప్పటికీ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే మాత్రం ఈ సినిమా ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది…ఇక ముఖ్యంగా లింగిడి లింగిడి సాంగ్ కి మాత్రం థియేటర్లో అందరూ డాన్స్ లు వేశారు…
ఇక ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ తన పాత్ర వరకు చాలా అద్భుతంగా నటించడమే కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో చాలా రోజుల తర్వాత యాక్టింగ్ లో తన డెప్త్ ని చూపించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ , వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక మురళి శర్మ యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది… ఇక మిగతా ఆర్టిస్టులు ఓకే అనిపించారు…
ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తె రంజన్ రాజ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లేస్ అయింది. అలాగే సినిమాటోగ్రాఫర్ అయిన జగదీష్ చీకటి అందించిన విజువల్స్ కూడా సినిమాకి చాలావరకు ప్లస్ అయ్యాయి. సినిమా మొత్తం ట్రావెలింగ్ లోనే ఉండడంవల్ల తన సినిమాటోగ్రఫీతో సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు… కార్తీక శ్రీనివాస్ ఇంకా కొంచెం షార్ప్ ఎడిటింగ్ చేసి బాగుండేది. కొన్ని సీన్లు అక్కడక్కడ బోర్ గా అనిపించాయి. కొంచెం షార్ప్ ఎడ్జ్ లో కట్ చేసి ఉంటే సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగేది… ఇక ఈ సినిమాని జిఏ 2 మీద బన్నీ వాసు నిర్మించారు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్
లింగిడి లింగిడి అనే సాంగ్
కథ
ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే
పోలీసుల్ని పోలీసులే తరమడం అనేది కొంచెం ఇల్లాజికల్ గా అనిపించింది…
స్క్రీన్ ప్లే
డైరెక్షన్ కొంచెం బెటర్ గా ఉండాల్సింది…
ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5