Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్ర్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదిన శైలి నటన పరంగా అభిమానులను సంపాదించుకున్న ఈ భామ, పర్సనల్ లైఫ్ లో మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉద్యమంగా అభివర్ణించడం కూడా వివాదాస్పదం అయింది. దీంతో సిక్కుల మతస్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఉద్దేశపూర్వకంగా ఒక మతాన్ని కించపరిచిందని.. పలువురు కేసులు కూడా నమోదుచేశారు. ఇటీవల ముంబైలో ఓ కేసు నమోదైంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కూడా కంగనాకు సమన్లు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా కంగనాకు మరోసారి షాక్ తగిలింది.
Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…
ఇపుడు తాజాగా ఆమెపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్ పోలీసులను ఆదేశించింది. స్వాతంత్య్రం పై కంగానా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కోమిరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దేశప్రజల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యానించిందని ఆయన పిటీషన్ లో దాఖలు చేశారు. అయితే దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోర్ట్ పోలీసులును ఆదేశించింది. అయితే ఇటీవల చేతిలో వైన్గ్లాస్ పట్టుకుని తన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ ఇంకో ఎఫ్ఐర్. నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్లు మా ఇంటి దగ్గరకు వస్తే నా మూడ్ ఇదే… అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు రైతుల విషయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Kamal Haasan: కమల్‌హాసన్ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం