Vishwak Sen : కమెడియన్ పృథ్వీ నోటి దూల కారణంగా ఈమధ్య కొన్ని సినిమాలకు ఎక్కడలేని నెగటివిటీ ఏర్పడుతుంది. ఇటీవలే ఆయన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పై పరోక్షంగా సెటైర్లు వేయగా, వాటికి వైసీపీ అభిమానులు తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెగటివ్ క్యాంపైన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన సందర్భం లేకుండా ఇలాంటి కామెంట్స్ చేసాడు. దీనిపై వైసీపీ అభిమానులు ఈరోజు ఉదయం నుండి #BoycottLaila అంటూ పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్ చేసారు. ఆ ట్యాగ్ పై సుమారుగా 25 వేల ట్వీట్స్ పడ్డాయి. సినిమా విడుదలైన రోజే HD ప్రింట్ ని దింపుతామని వార్నింగ్ ఇవ్వడం తో విశ్వక్ సేన్ కాసేపటి క్రితమే మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం నుండి #BoycottLaila అని 25 వేలకు పైగా ట్వీట్స్ వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నాతో శత్రుత్వం ఏముంది సార్ మీకు, ఆయనెవరో కామెంట్ చేస్తే మాకేంటి సంబంధం. మా కంట్రోల్ లో ఉండదు అది. ఆయన ఆ కామెంట్స్ చేసేటప్పుడు మేము అక్కడే ఉండుంటే, కచ్చితంగా పైకి వెళ్లి మైక్ గుంజుకునేవాళ్ళం. కానీ ఆ సమయం లో మేము అక్కడ లేము. గెస్ట్ ని రిసీవ్ చేసుకునే బిజీ లో ఉన్నాము. ఇంటికి వెళ్లి చూసుకున్న తర్వాత ఆయన అలా మాట్లాడాడు అని తెలిసింది. మా స్టేజి మీద ఆయన అలా మాట్లాడాడు కాబట్టి, మేము క్షమాపణలు చెప్తేనే మీరు శాంతిస్తారు అనుకుంటే, మీ అందరికి క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మా సినిమాని చంపేయకండి’ అంటూ విశ్వక్ సేన్ వేడుకుంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
సినిమా ఈవెంట్స్ లో రాజకీయాల గురించి మాట్లాడడం అనేది తప్పే, కానీ గతం లో వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రెస్ మీట్ పెట్టి మరీ నెగటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, రాజకీయ నాయకులూ అలా చెప్పొచ్చా అనేది కూడా ఒకసారి వైసీపీ అభిమానులు అర్థం చేసుకోవాలంటూ జనసేన పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నచ్చకపోతే బాగాలేదు అనడం లో ఎలాంటి తప్పు లేదు, కానీ విడుదలైన రోజు ఉదయాన్నే పైరసీ దింపేస్తున్నాం అని బెదిరించడం అన్యాయం అంటూ నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉండగా లైలా చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అడల్ట్ కామెడీ తో నిండిపోయిన ఈ ట్రైలర్ ని చూస్తే మూవీ టీం కేవలం యూత్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా అనిపించింది.
#BoycottLaila ani 25k tweets vesi racha leparu maku teidu memu prudhvi matladinapudu unte mike lakkoni apevallam – #VishwakSen
Night mana social media debbaki movie team digi vachi sorry chepindi pic.twitter.com/eJS7QEeS9y
— Bhargav Reddy (@mbrforjagan) February 10, 2025