Actress Rambha: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడాలి. హీరోయిన్ రంభ.. అందంలో అభినయంలో ఆమె సొగసుల సోయగం. ఎనలేని తన అందాల నటనా ధారలతో తెలుగు వెండితెరను నిలువెల్లా తడుపుతున్న నిండు పున్నమి తార రంభ. సినీ నీలి అంబరాన మూడు దశాబ్దాలుగా మురిసి మెరిసిపోతూ మైమరిపిస్తోన్న తళుకుల రంగుల జాబిల్లి రంభ.

ఎన్నో పాత్రలు మరెన్నో బావోద్వాగాలు, అన్నిటికీ మించి అందాల తుళ్ళింతలు వెరసి.. నేటి మోస్ట్ గ్లామర్ బ్యూటీలు కూడా రంభ గ్లామర్ ముందు సరితూగరు. రంభ కెరీర్ స్టార్టింగ్ లో వరుస ప్లాప్ లు.. దాంతో ఆమెను ఐరన్ లెగ్ అన్నారు. అవకాశాలు ఇవ్వకపోగా హేళన చేశారు. కానీ, రంభ నటన ముందు, ఆమె అందం ముందు బాక్సాఫీస్ దాసోహం అయింది.
మొదట్లో రంభను దూరం పెట్టినవారే.. ఆ తర్వాత రంభ డేట్లు కోసం పడిగాపులు కాశారు. అప్పట్లో గ్లామరస్ రోల్స్ లో రంభ తర్వాతే ఎవరైనా.. అలాగే ఫ్యామిలీ చిత్రాలతోనూ రంభ మెప్పించింది. కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్స్ లోనూ రంభ ఆకట్టుకుంది. పైగా తెలుగు, తమిళ భాషల్లో ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న రంభ, అటు బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఉత్తరాది భామలకు గట్టి పోటి ఇచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లాంటి హీరోతో కూడా రంభ కలిసి నటించింది. ఆ సినిమాలో రంభ నటించిన బోల్డ్ సీన్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి కూడా. రంభ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం కసరత్తులు చేస్తోంది. ఐతే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు.
అందుకే.. రంభ తన రూట్ మార్చింది. బుల్లితెర పై ప్రసారం కానున్న ఓ ప్రోగ్రామ్ కి ఆమె జడ్జ్ గా వ్యవహరించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే పలువురు మాజీ హీరోయిన్లు జడ్జ్ లుగా పోటీ పడుతున్నారు. మరి ఇప్పుడు రంభ కూడా వారి సరసన చేరబోతుంది. తమిళంలో ప్రసారం కానున్న ఈ షోకి రంభ ప్రత్యేక ఆకర్షణ. మరి టీఆర్పీ రేటింగ్ పరిస్థితి ఏమిటి అనేది చూడాలి.
Recommended Videos:


