Searching In Google: దేశంలో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లో సోషల్ మీడియాను అధికంగా వినియోగిస్తున్నారు. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ చేసేస్తున్నారు. చిన్న పదం కావాలన్నా.. చిన్న డౌట్ క్లారిఫై కావాలన్నా గూగుల్ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాడే అంశాలపై గూగుల్ ఓ రిపోర్టు విడుదల చేసింది.
అయితే సర్వే రిపోర్టులో మహిళలు ఎక్కువగా గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకుని ఆశ్చర్యపోయింది. సాధారణంగా దేశవ్యాప్తంగా గూగుల్ యూజర్స్ 15 కోట్ల మంది ఉంటే అందులో 6 కోట్ల మంది మహిళలే ఉన్నారు. మహిళల్లో కూడా ఎక్కువగా 15 ఏళ్లను 34 ఏళ్ల లోపు వారే గూగుల్ వినియోగిస్తున్నారు. దీంతో వాళ్లు ఎక్కువగా గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారంటే.. బ్యూటీ టిప్స్ వెతుకుతున్నారని సర్వే రిపోర్టు తెలియజేసింది.
వంటలు ఎలా నేర్చుకోవాలనే విషయంతో పాటు రకరకాల గోరింటాకు డిజైన్‌లు, రొమాంటిక్ పాటలు, కవితల కోసం మహిళలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు గూగుల్ సర్వే రిపోర్టు వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బ్యూటీ చిట్కాల కోసం, బ్యూటీ ప్రొడక్టుల కోసం గూగుల్‌లో వెతుకుతున్నట్లు తెలిపింది. దీనిని బట్టి మహిళలు తమ మొగుడినైనా పక్కన పెడతారు కానీ అందం అంటే వాళ్లకు ఎంత పిచ్చో అర్థం అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
అంతేకాకుండా గూగుల్‌లో అమ్మాయిలు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల కోసం కూడా వెతుకుతున్నారట. బట్టలలో చీర డిజైన్‌ల కోసం, కొత్త కలెక్షన్‌ల కోసం సెర్చ్ చేస్తున్నారట. కొంతమంది అమ్మాయిలు ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఎలాంటి సెంటర్‌లో కోచింగ్ తీసుకోవాలనే విషయాలపై కూడా గూగుల్‌లో వెతుకుతున్నట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. అయితే ఎక్కువ మహిళలు మాత్రం అందచందాల గురించే సెర్చ్ చేస్తున్నారని గూగుల్ రిపోర్టు తెలిపింది.