Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రామాయన్’ మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని అనుకున్నారు మేకర్స్. నాలుగు రోజుల క్రితం అన్ని భాషలకు సంబంధించిన మీడియా రిపోర్టర్స్ ని పిలిచి వాళ్లకు ప్రత్యేకంగా ట్రైలర్ ని కూడా చూపించారు. మూవీ టీం తో పాటు, రామ్ దేవ్ బాబా కూడా ఈ ట్రైలర్ ఈవెంట్ కి హాజరయ్యారు. అలా గ్రాండ్ లెవెల్ లో నేడు ట్రైలర్ ని విడుదల చెయ్యాలని అనుకున్నారు , కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. రెడీ గా ఉన్న ట్రైలర్ ని విడుదల చేయకపోవడం ఏంటి అని అభిమానుల్లో నిరాశ తో కూడిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
అయితే ఈ మూవీ టీం లో రీసెంట్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా జాయిన్ అయ్యింది. సోనీ పిక్చర్స్ తో భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ , వాళ్ళ కోరిక మేరకు ఈ థియేట్రికల్ ట్రైలర్ ని వేరే డేట్ లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాము అంటూ ప్రకటించారు. ముంబై లో ట్రైలర్ ని చూసిన కొంతమంది రిపోర్టర్స్, శ్రీ రాముడి స్క్రీన్ టైం కంటే, రావణాసురిడి స్క్రీన్ టైం ఎక్కువ ఉందని, అంతే కాకుండా గ్రాఫిక్స్ కంటెంట్ చాలా అవుట్ డేటెడ్ గా ఉందని , కొన్ని తప్పులు సరిచేయాల్సిన అవసరం ఉందని , సోనీ పిక్చర్స్ సంస్థ చెప్పడంతో , ఈ సినిమా ట్రైలర్ ని వాయిదా వేసినట్టు బాలీవుడ్ ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ట్రైలర్ కి సంబంధించిన కొన్ని షాట్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.
ఆ షాట్స్ లోని VFX చూసి నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. టీవీ సీరియల్స్ లో రామాయణం ని ఇంత కంటే బెటర్ క్వాలిటీ గా తీశారు కదా, రణబీర్ కపూర్, యాష్ లాంటి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని చేతుల్లో పెట్టుకొని , ఇలాంటి క్వాలిటీ నా మైంటైన్ చేసేది?, పైగా 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ఈ ట్రైలర్ ని వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చూడాలి మరి తదుపరి డేట్ లో అయినా మంచి క్వాలిటీ ట్రైలర్ ని వదులుతారో లేదో అనేది.
Ramayana’s journey from Bharat to the World has begun.
.
.
.
.Reposted from @malhotra_namit
— The World Of Ramayana (@WorldOfRamayana) July 24, 2026





