https://oktelugu.com/

Sarath Babu – Ramaprabha : శరత్ బాబు ని తల్చుకొని బోరున ఏడ్చేసిన రమాప్రభ..ఇక నావల్ల కాదు అంటూ కామెంట్స్

ఆ తర్వాత శరత్ బాబు మూడవ పెళ్లి చేసుకొని చెన్నైలోనే స్థిరపడ్డాడు. ఆయనకీ ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు. ఇక శరత్ బాబు చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం సమయం లోనే అనారోగ్యం తో బాధపడుతున్న శరత్ బాబు, ఈ చిత్రం తర్వాత మరింత అనారోగ్యానికి గురి అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 23, 2023 / 10:10 AM IST
    Follow us on

    Sarath Babu – Ramaprabha : తెలుగు మరియు తమిళ భాషలకు కలిపి సుమారుగా 250 కి పైగా సినిమాల్లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా నటించిన శరత్ బాబు నిన్న తన తుదిశ్వాస ని వదిలేసినా ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసింది. అరుదైన వ్యాధితో గత కొంతకాలం నుండి బాధపడుతున్న శరత్ బాబు ఆరోగ్యం విషమించడం తో ఆయనని వెంటనే చెన్నై హాస్పిటల్ కి తరలించారు.

    అక్కడ ప్రధమ చికిత్స తీసుకున్న తర్వాత అక్కడి డాక్టర్లు హైదరాబాద్ AIG హాస్పిటల్స్ కి తీసుకెళ్లమని చెప్పగా, గత నెల రోజుల నుండి AIG హాస్పిటల్స్ చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకుంటాడని అందరూ అనుకున్నారు.కానీ ఇంతలోపే ఆయన తిరిగిరాని లోకాలకు పయనం అవ్వడం దురదృష్టకరం. ఇండస్ట్రీ మొత్తం ఆయన మృతి పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చిరంజీవి , పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ట్విటర్ ద్వారా శరత్ బాబు కి సంతాపం తెలిపారు.

    ఇక శరత్ బాబు మృతి పట్ల ఆయన మాజీ భార్య రమాప్రభ కూడా విచారం వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న చెన్నై లోని శరత్ బాబు నివాసం కి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి సంతాపం వ్యక్తం చేసి, బోరుమని ఏడ్చేసినట్టు తెలుస్తుంది. రమాప్రభ ని శరత్ బాబు 1974 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమారుగా 14 ఏళ్ళ పాటు వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ , అనుకోకుండా ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

    వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ ఒకరి మీద ఒకరు మంచి గౌరవం తోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత శరత్ బాబు మూడవ పెళ్లి చేసుకొని చెన్నైలోనే స్థిరపడ్డాడు. ఆయనకీ ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు. ఇక శరత్ బాబు చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం సమయం లోనే అనారోగ్యం తో బాధపడుతున్న శరత్ బాబు, ఈ చిత్రం తర్వాత మరింత అనారోగ్యానికి గురి అయ్యాడు.