Ramakrishna Electronics bank: టాలీవుడ్ అగ్ర నిర్మాతల జాబితా అల్లు అరవింద్(Allu Aravind) పేరు లేకుండా పూర్తి అవ్వదు. స్వర్గీయ అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన, కెరీర్ ప్రారంభం లో నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. అది ఆయనకు పెద్దగా కలిసి రాకపోవడంతో నిర్మాత గా మారాడు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘గీతా ఆర్ట్స్'(Geetha Arts) సంస్థ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్, ఇప్పటికీ విజయవంతమైన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాదాలకు కాంట్రవర్సిలకు సాధ్యమైనంత దూరాన్ని మైంటైన్ చేస్తూ వచ్చే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కాం కేసులో నేడు ఈడీ అధికారులు అల్లు అరవింద్ ని విచారించారు. 2017 నుండి 2019 ప్రాంతం లో స్కాం పెద్ద కలకలమే సృష్టించింది.
Also Read: అల్లు అరవింద్ ను ప్రశ్నించిన ఈడీ
ఎంతో మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ స్కాం లో చిక్కుకున్నారు. కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ మొదలు పెట్టిన ఈడీ నేడు అల్లు అరవింద్ ని పిలిపించి విచారణ చేశారు. పలు కోణాల్లో ఆయన్ని ప్రశ్నించారు. వచ్చే వారం మరోసారి తప్పనిసరిగా విచారణకు అందుబాటులో ఉండాలని అల్లు అరవింద్ ని ఆదేశించారు. ఇంతకు అల్లు అరవింద్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు?, ఈ స్కాం లో ఆయనకు నిజంగా పాత్ర ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా తనపైన ఏదైనా ప్రచారం జరిగితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అసలు వాస్తవాలు తెలియజేయడం అల్లు అరవింద్ కి అలవాటు. అలాంటి ప్రెస్ మీట్ ఇప్పటి వరకు పెట్టలేదు.
రాబోయే రెండు మూడు రోజుల్లో అయినా ప్రెస్ మీట్ ని పెట్టి అసలు ఏమి జరిగింది అనే దానిపై ఆయన క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. మరో పక్క ఈ విషయం పై సోషల్ మీడియా లో అల్లు అరవింద్ పై ట్రోలింగ్స్ మామూలు రేంజ్ లో లేవు. చాలా కాలం నుండి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ కి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాలు వాళ్ళ హీరోల విషయం లో ఏ చిన్న నెగెటివ్ జరిగినా ట్రోల్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఈ అంశంపై కూడా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.