https://oktelugu.com/

Ram Pothineni: వరుసగా రెండు భారీ ప్లాప్ లను మూటగట్టుకున్న రామ్… మరోసారి ప్లాప్ డైరెక్టర్ కే అవకాశం ఇచ్చాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యంగ్ హీరోలు సినిమాలను చేసుకుంటూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక మరికొందరు మాత్రం హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 24, 2024 / 04:37 PM IST

    Ram Pothineni

    Follow us on

    Ram Pothineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని… ఇక ఈయన హీరోగా జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందు ఆయన బోయపాటి శీను డైరెక్షన్ లో చేసిన ‘స్కంద’ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో రామ్ కెరియర్ ప్రస్తుతం డైలమాలో పడింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి బోయపాటి ఇద్దరు కమర్షియల్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీళ్లే రామ్ కి హిట్టు ఇవ్వలేకపోయారు అంటూ కొన్ని వార్తలైతే వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు రామ్ ఏ సినిమా చేసినా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన సినీ కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన దేవదాసు, కందిరీగ, రెడీ, నేను శైలేజా, ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి విజయాలతో తన సక్సెస్ ల పరంపరని కొనసాగించాడు. కానీ ప్రస్తుతం ఆయన వరుస ప్లాప్ లను మూట గట్టుకుంటూ ముందుకు సాగడం అనేది అతని అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి హరీష్ శంకర్ కూడా ఇప్పుడు అంత పెద్ద ఫామ్ లో అయితే లేడు. రీసెంట్ గా ఆయన రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

    కాబట్టి ఇలాంటి సమయంలో రామ్ మరోసారి రిస్క్ చేస్తున్నాడా అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనాప్పటికీ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ లో మాత్రం చాలా కేర్ ఫుల్ గా నడుచుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.

    ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాకి ముందే రామ్ సినిమాని పట్టాలెక్కించి సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి హరీష్ శంకర్ ఇప్పుడు కథ మీద మంచి ఫోకస్ చేసి రామ్ కోసం ఒక హై వోల్టేజ్ కథని రాసుకొని ఆయనతో సినిమా చేసి సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక హరీష్ శంకర్ ప్రస్తుతం ఆయన కెరియర్ లో చాలా వరకు రీమేక్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు రామ్ తో చేయబోయే సినిమా కూడా రీమేక్ గానే తెరకెక్కుతుందా లేదంటే ఒరిజినల్ కథతో సినిమా చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది…