టాలీవుడ్లో హస్యనటుడిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్యం కెరీర్ తొలినాళల్లో నాటకాలు.. టెలివిజన్లో నటించి ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా.. సంగీత దర్శకుడిగా.. రచయితగా ఆయన పని చేశారు. డిసెంబర్ 7, 2013లో ఆయన కాలేయ క్యాన్సర్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడం టాలీవుడ్లో విషాదాన్ని నింపింది.
Also Read: టాలీవుడ్ అప్డేట్.. సంక్రాంతి ఆశలు కూడా గల్లంతేనా?
ధర్మవరపు సుబ్రహ్మణం దూరమై దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా ఆయన ఇంకా మనమధ్యే ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటోంది. అయితే ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వారు పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తాజా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆఖరి రోజుల్లో ఏం జరిగిందనే విషయాలపై ఆయన సతీమణి, చిన్న కుమారుడు వివరించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దాదాపు 10నెలలు ఆస్పత్రిలో ఉన్నా ఇండస్ట్రీ వాళ్లు పట్టించుకోలేదని వ్యాఖ్యల్లో నిజంలేదన్నారు. తనను కలుసుకోవడానికి చాలామంది వస్తామని చెప్పినా ఆయన రానివ్వలేదని తెలిపారు. తన పరిస్థితి చూస్తే వారు తట్టుకోలేరని చెబుతూ వారిని రాకుండా ఆపే ప్రయత్నం చేశారని తెలిపారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తాజా సర్ ప్రైజ్ కి రీజన్ అదే !
టాలీవుడ్లో ఆయనకు చాలా మందితో ఎమోషనల్ బాండింగ్ ఉండేదని.. వారంతా పనులన్నీ పక్కనపట్టి తనకోసం రావడం ఇష్టంలేకనే ఆయన అలాచేసేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆయన చివరిరోజుల్లో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేరనే వార్తలో కూడా నిజం లేదని తెలిపారు. ఆయన తమను ఓ ప్రణాళిక ప్రకారంగా సెటిల్ చేసినట్లు తెలిపారు.
ఇక పొలికట్ గా ఆయన వైఎస్ రాజశేఖర్ తో సాన్నిహిత్యంగా ఉండేవారని చెప్పారు. ఇప్పటికీ కూడా సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిగారు తమ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారని తెలిపారు. అంబటి రాంబాబు కూడా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా ధర్మవరపు సుబ్రహ్మణం కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్పష్టమవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్