Roja: జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న జడ్జీలలో రోజా ఒకరు. జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఈ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వైసీపీలో రోజా మంత్రిగా ఎంపికయ్యారు. రోజా మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు దూరమయ్యారు. ప్రజా సేవకే పూర్తి సమయం కేటాయించాల్సి ఉండటంతో రోజా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ షోకు దూరం కావాల్సి వచ్చింది.
తనకు రోజా మేడమ్ ఆటో రామ్ ప్రసాద్ అని పేరు పెట్టారని రోజా గారు స్మైల్, అందం అలాగే మైంటైన్ చేయాలని రామ్ ప్రసాద్ కామెంట్లు చేశారు. ఇల్లు అసెంబ్లీకి వెళ్తున్న రోజా గారు తర్వాత పార్లమెంట్ కు వెళ్తారని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. రోజా గారు వెళ్లిపోతూ ఉండటంతో రామ్ ప్రసాద్ కూడా ఎమోషనల్ అయ్యారు. రోజా మాట్లాడుతూ పదేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా నడిపానని వెల్లడించారు.
దేవుని ఆశీస్సులు, నగరి ప్రజల ఆశీస్సుల వల్ల తన కల నెరవేరిందని రోజా కామెంట్లు చేశారు. సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టమని అందరినీ మిస్ అవుతున్నానని రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరూ తనకు సపోర్ట్ చేయాలని ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తానని రోజా వెల్లడించారు.
Recommended Videos: