Actor Ali Life Story: తెలుగు సినిమాల్లో కమెడియన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. కొన్ని సినిమాల్లో కమెడియన్ లేకపోతే ఆ సినిమానే బాగుండదని కొందరి అభిమానుల అభిప్రాయం. అందుకే డైరెక్టర్లు కొంతమంది కమెడియన్లను ప్రత్యేకంగా సినిమాలో ఉండేలా చేస్తారు. అలాంటి వారిలో ఆలీ ఒకరు. చిన్నప్పటి నుంచే సినిమా రంగంలో ఉంటూ అన్ని పాత్రల్లో తనదైన టాలెంటును చూపించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన హీరోగాను ప్రత్యేక పర్ఫామెన్స్ చూపించాడు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అలీ పర్సనల్ విషయాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోలేదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడని ఓ సందర్భంలో చెప్పాడు. అయితే ఆలీ పూర్వీకులది అసలు ఈ దేశం కాదని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకీ ఆల్ ఇది ఏ దేశం?
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో సెకండ్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని..ఎవరంటే!
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ఆలీ సీతాకోకచిలుక సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సినిమాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఆలీకి బోలెడు అవకాశాలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో అప్పటికే బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి వంటి కమెడియన్లు ఉండగా వారికి పోటీ ఇస్తూ అలీ తనదైన ప్రతిభ చూపించాడు. అలా ఆలీ ప్రతిభను గుర్తించిన ఎస్వి కృష్ణారెడ్డి యమలీల సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో హీరోగా చేసిన ఆలీ ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గానే కొనసాగించాడు.
అయితే ఆలీ స్వగ్రామం రాజమండ్రి అని చాలామందికి తెలుసు. కానీ ఆయన ఓ ఇంటర్వ్యూలో తన పూర్వికులు అది ఈ దేశం కాదని చెప్పుకొచ్చాడు ఆలీ తాత, నానమ్మ లతో కలిసి కొందరు అప్పటి బర్మా ఇప్పటి మయన్మార్ దేశం నుంచి రాజమండ్రి కి వలస వచ్చారు అని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ స్థిరపడిన ఆలీ ఇక్కడే తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన ఆలీ సినిమా రంగంలో అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read: టికెట్స్ రేట్స్ తగ్గించమని అడగడం అన్యాయం..’హరి హర వీరమల్లు’ నిర్మాత హాట్ కామెంట్స్!
తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, నేపాలి సినిమాల్లో కూడా నటించారు. ఎక్కడ నటించిన ఆలీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. అందులో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి చేపట్టాడు. ప్రస్తుతం ఆలీ అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. కొన్ని వెబ్ సిరీస్ లోనూ అలీ నటిస్తున్నారు. బ్రహ్మానందంతో సమానంగా తెలుగు ప్రేక్షకులకు కామెడీ పండించిన ఆలీ ఇప్పటికీ తన పాత సినిమాలను ప్రత్యేకంగా చూసేవారు ఎందరో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ఆలీ ఆయన నటించిన ప్రతి సినిమాలో దాదాపు అలీ కనిపించేవాడు. అలీ అంటే కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరూ కలిసి లేని సినిమా అంటూ ఉండదు. కొన్ని కామెడీ షో లో కూడా అలీ కనిపిస్తూ తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు.