https://oktelugu.com/

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై హీరో రామ్‌ సంచలన వ్యాఖ్యలు!

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్‌ శంకర్ ఘన విజయం సాధించడంతో పుల్ జోష్‌లో ఉన్నాడు యువ హీరో రామ్ ‌పోతినేని. ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నా.. కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఆ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. షూటింగ్స్‌ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రామ్‌ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించే ధైర్యం చేశాడు. ఏపీ సీఎం జగన్‌ పేరు చెడగొట్టడానికి, ఆయనకు వ్యతిరేకంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2020 / 07:19 PM IST
    Follow us on


    పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్‌ శంకర్ ఘన విజయం సాధించడంతో పుల్ జోష్‌లో ఉన్నాడు యువ హీరో రామ్ ‌పోతినేని. ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నా.. కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఆ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. షూటింగ్స్‌ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రామ్‌ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించే ధైర్యం చేశాడు. ఏపీ సీఎం జగన్‌ పేరు చెడగొట్టడానికి, ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ట్వీట్‌ చేశాడు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. #APisWatching (ఏపీ చూస్తోంది) పేరుతో హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్స్‌ చేశాడు.

    Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

    అగ్నిప్రమాదం, ఆ తర్వాతి పరిణామాలపై పెద్ద కుట్ర ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదాన్ని అడ్డుగా పెట్టుకుని జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారన్నాడు. అగ్ని ప్రమాదం జరిగిన రోజే బాధితులకు సంఘీభావం ప్రకటించిన రామ్‌ ఈ రోజు ట్విట్టర్లో సంచలన పోస్టులు చేశాడు. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ సెంటర్ నిర్వహించిన రమేశ్‌ ఆసుపత్రుల యజమాని రామ్‌కు దగ్గరి బందువు. అందుకే యువ నటుడు సోషల్‌ మీడియా వేదికగా తన అనుమానాలను బహిరంగ పరిచాడు. ‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ అని ప్రశ్నిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను షేర్ చేశాడు.

    Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

    ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ మరో ట్వీట్‌ చేసిన రామ్.. ‘అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. మేనేజ్‌మెంట్ బాధ్యతలనును నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది అంటూ రసీదులను బయటపెట్టాడు. ఫైర్ సేఫ్టీకి డాక్టర్లు బాధ్యులు కాదని పేర్కొన్నాడు. ‘పెద్ద కుట్ర జ‌రుగుతున్నట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! వైఎస్‌ జగన్‌ గారు..మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్కు‌ , మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’ అని ట్విట్టర్లో కోరాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రామ్‌ సంధించిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో మరి?