https://oktelugu.com/

ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య అగాధం?

రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు న్యాయ వ్యవస్థను అప్రదిష్టపాలు చేసేవిగా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎ స్థాయికి చేరుకుంటాయో అనే సంగతి ఊహకందకుండా ఉంది. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య అగాధం ఏర్పడింది. ఈ కారణాలతో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ అగాధం మరింత ముదిరే అవకాశాలు కనిపస్తున్నాయి. కొద్ది రోజులుగా న్యాయ స్థానాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని తీర్పులు వస్తున్నాయి. మొదటి ఏడాది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2020 7:45 pm
    Follow us on


    రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు న్యాయ వ్యవస్థను అప్రదిష్టపాలు చేసేవిగా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎ స్థాయికి చేరుకుంటాయో అనే సంగతి ఊహకందకుండా ఉంది. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య అగాధం ఏర్పడింది. ఈ కారణాలతో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ అగాధం మరింత ముదిరే అవకాశాలు కనిపస్తున్నాయి. కొద్ది రోజులుగా న్యాయ స్థానాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని తీర్పులు వస్తున్నాయి. మొదటి ఏడాది కాలంలో 62 తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థపై తన అక్కసును వివిధ రూపాల్లో వెల్లగక్కింది. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, నాయకులు ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఒక విమర్శ చేశారు. అదేంటంటే వ్యవస్థలను చంద్రబాబు బాగా మ్యానేజ్ చేస్తారని అన్నారు.

    Also Read: తెలంగాణ లో హై అలెర్ట్ : కరోనా ని మించిన ముప్పు

    వైసీపీ నాయకులు న్యాయస్థానాల విషయంలో ఈ వ్యాఖ్యలు పరోక్షంగా చేశారనే వాదనలు వినిపించాయి. గతంలో వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హై కోర్టు న్యాయమూర్తుల ఫోన్ కాల్స్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వెనుక ఉద్దేశం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఆరోపణలను నిరూపించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుందనే విషయం స్పష్టం అవుతుందనే వాదనలు ఉన్నాయి.

    హై కోర్టుకు సంబందించిన న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానం న్యాయమూర్తులకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పత్రికలో కథనాలు ప్రచురితం అయ్యాయి. న్యాయమూర్తులు వారి ఫోన్ లు సరిగా పని చేయకపోవడంతో సాంకేతిక సమస్య అయిఉంటుందని ఆరా తీస్తే ఫోన్ సెట్టిగ్స్ అన్ని సక్రమంగా ఉండటం, మరి కొందరి న్యాయమూర్తుల ఫోన్ లకు అటువంటి సమస్యలే రావడంతో నిపుణులు ఫోన్ ట్యాపింగ్ గా భావిస్తున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగించి ఈ చర్యలకు పాల్పడుతున్నరన్న సందేహాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?

    జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంబాషణ వ్యవహారం వెలుగులోకి రావడంతో న్యాయవ్యవస్థను అప్రదిష్టపాలు చేసేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయని హై కోర్టు భావిస్తోంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు హై కోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం విధితమే. విచారణకు సీబీఐ, కేంద్ర విజిలెన్స్ సంస్థలు సహకారం అందించాలని ఆదేశించింది. ఈ సంఘటన చోటు చేసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సంఘటనపై హై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.