Ram Pothineni- Puri Jagannadh: దర్శకుడు పూరి జగన్నాధ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఆయన అర్జెంటుగా ఓ మూవీ చేయాలి. లేదంటే పరిశ్రమ మర్చిపోయే పరిస్థితి ఉంది. లైగర్ ప్లాప్ ఆయన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఆ కారణంగానే మొదలుపెట్టిన జనగణమన ఆగిపోయింది. లైగర్ రిజల్ట్ చూసిన జనగణమన నిర్మాతలు అమ్మబాబోయ్ అని పారిపోయారు. దాంతో ఆయన డ్రీం ప్రాజెక్ట్ అటకెక్కింది. దీని తోడు ఈడీ విచారణలు, ఎగ్జిబిటర్స్ ధర్నాలు, నిరసనలు. అన్ని విధాలుగా ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.
స్టార్ హీరోలు ఆఫర్స్ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. లైగర్ విజయం సాధిస్తే కథ వేరుగా ఉండేది. ఆయనకు పూర్వవైభవం వచ్చేది. కొద్దిరోజులుగా హీరోల కోసం వెతుకుతున్న పూరికి రామ్ పోతినేని దొరికాడు. ఆయన పూరి జగన్నాధ్ చెప్పిన కథను ఓకే చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రేపు గ్రాండ్ గా ప్రకటిస్తున్నారు. మొన్నటి వరకు అజ్ఞాతంలో ఉన్న హీరోయిన్ ఛార్మి బయటకు వచ్చింది.
ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. పూరి-రామ్ పోతినేని ప్రాజెక్ట్ గురించిన అప్డేట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూరి-ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. వరుస పరాజయాలతో పూరి జగన్నాధ్ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. క్రిటికల్ టైమ్ లో రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ మూవీ తీసి విజయం సాధించారు.
ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ మూవీ పూరి-ఛార్మి కష్టాలు మొత్తం తీర్చేసింది. కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకున్నారు. రామ్ పోతినేనికి కూడా ఇస్మార్ట్ శంకర్ మెమరబుల్ హిట్. చాలా కాలంగా ఆయనకు క్లీన్ హిట్ లేదు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ హిట్ ట్రాక్ ఎక్కారు. నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుంది. పూరి జగన్నాధ్ కి ఈ చిత్రం లాస్ట్ ఛాన్స్ అని చెప్పాలి. మరోవైపు రామ్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.