https://oktelugu.com/

Ram Gopal Varma: ఆ మినిస్టర్ ఎవరో తెలియదంటున్న ఆర్జీవి… పంచ్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్ ?

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వార్ రోజురోజుకు ముదరుతోంది. రామ్ గోపాల్ వర్మతో వాదన పెట్టుకుంటే ఇక మొత్తం వదిలేసుకోవాల్సిందే. దాచుకోవడానికి ఏమీ లేకుండా చేస్తాడు. అందుకే ఆయనతో పెట్టుకోవడానికి చాలా మంది వెనుకాడతారు. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏపీ ప్రభుత్వంలోని కొంత మంది ఆయనతో వాదన పెట్టుకుంటున్నారు. అదీ కూడా థియేటర్ టిక్కెట్ల విషయంలో మంత్రి పేర్ని నానికి… ఆయనకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. తాజాగా ఆయన వేసిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 07:59 PM IST
    Follow us on

    Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వార్ రోజురోజుకు ముదరుతోంది. రామ్ గోపాల్ వర్మతో వాదన పెట్టుకుంటే ఇక మొత్తం వదిలేసుకోవాల్సిందే. దాచుకోవడానికి ఏమీ లేకుండా చేస్తాడు. అందుకే ఆయనతో పెట్టుకోవడానికి చాలా మంది వెనుకాడతారు. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏపీ ప్రభుత్వంలోని కొంత మంది ఆయనతో వాదన పెట్టుకుంటున్నారు. అదీ కూడా థియేటర్ టిక్కెట్ల విషయంలో మంత్రి పేర్ని నానికి… ఆయనకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. తాజాగా ఆయన వేసిన ట్వీట్ రివర్స్ పంచ్‌ లెవల్లో సినిమాలపై సెటైర్లు వేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలకు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

    తాజాగా సీన్‌లోకి మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. రాంగోపాల్ వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో ఉండి ఏపీ గురించి రాంగోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్లని తాము అసలు పట్టించుకోమని పేర్కొన్నారు. అయితే మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో తాను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని వర్మ పేర్కొన్నారు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని… వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో తెలియదని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

    కొద్ది రోజల క్రితం శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల సందర్భంగా టిక్కెట్ల అంశంపై హీరో నాని స్పందించారు. ధియేటర్ యజమానుల కన్నా ఆ ధియేటర్ ఎదురుగా ఉండే కిరాణా దుకాణ యజమానికి ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే… తనకు ఒక్క కొడాలి నాని మాత్రమే తెలుసని ఆయన పాపులర్ అని.. ఇంకే నాని తెలియదని అనేశారు. ఇప్పుడు రివర్స్ లో రామ్ గోపాల్ వర్మ కౌంటర్ స్ట్రాంగ్ డోస్‌లాగా కనిపిస్తోంది.