Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదాస్పదమే. పబ్లిసిటీ, పాపులారిటీ ఫ్రీగా రాబట్టడంలో ఆయనకు మించినవాడు ప్రపంచంలో లేడు. ఈ మేధావి డైరెక్టర్ సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. విషయం ఏదైనా వర్మ సెటైర్లు ఘాటుగా ఉంటాయి. స్వార్థం కోసం వ్యక్తులను టార్గెట్ చేస్తూ విమర్శలపాలవుతూ ఉంటాడు. అలాగే వర్మను వాదించి గెలవడం అంత ఈజీ కాదు. మీరు వెధవ అంటే… అవును నేను అదే, ఐతే ఏంటి? అంటారు. ఒకప్పుడు దేశం మెచ్చిన సినిమాలు చేసిన వర్మ ప్రస్తుతం కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు.

లక్షలు పెట్టి చిన్నా చితకా సినిమాలు తీసి కోట్లు కొల్లగొట్టాలి అనుకుంటున్నాడు. వర్మ దగ్గర ఫేడ్ అవుటైన కొందరు హీరోయిన్స్ ఉన్నారు. వారు పెద్దగా రెమ్యూనరేషన్ తీసుకోరు. సినిమా అనగానే ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా ఒప్పుకుంటారు. వారిలో అప్సర రాణి ఒకరు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్, డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సరా రాణి నటించారు. ఈమె వర్మకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటారు.
తన సినిమాల్లో అవకాశం ఇస్తూనే పలుకుబడి ఉపయోగించి ఇతరుల చిత్రాల్లో కూడా ఆఫర్స్ ఇప్పిస్తారు. క్రాక్ మూవీలో ఐటెం సాంగ్ ఆఫర్ వర్మ కారణంగానే వచ్చింది. అదే సమయంలో ఈమెను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. తాజాగా రెడ్ బికినీ ధరించిన అప్సరా రాణి బోల్డ్ ఫోటోలు షేర్ చేశారు. అలాగే సదరు ఫోటోలకు తనదైన కామెంట్ యాడ్ చేశాడు. యంగ్ అండ్ వైల్డ్, కానీ ఫ్రీ కాదు. విలువ చెప్పాలంటే డైమండ్ తో సమానం అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. వర్మ ట్వీట్ వైరల్ కాగా, అప్సరా రాణి ఫోటోలు చూసి జనాలు పండగ చేసుకుంటున్నారు.

అప్సరా రాణి అసలు పేరు అంకిత మహారాణా. వర్మ ఆమె పేరును అప్సరా రాణిగా మార్చేశాడు. ‘4 లెటర్స్’ చిత్రంతో అప్సరా రాణి వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత ఉల్లాలా ఉల్లాలా టైటిల్ తో మరో చిత్రం చేశారు. ఆఫర్స్ రాకపోవడంతో వర్మ పంచన చేరారు. నమ్ముకున్నందుకు తన వంతు సాయం చేస్తున్నారు. వర్మ సంస్థానంలో ఉన్న మరొక హీరోయిన్ నైనా గంగూలీ. అప్సరా రాణి-నైనా గంగూలీ డేంజరస్ మూవీలో లెస్బియన్స్ గా నటించారు. అనేక అవాంతరాల మధ్య ఈ మూవీ విడుదలైంది.
Young ,wild and not free but as valuable as a diamond 🙏 https://t.co/mX5XJWUH8R
— Ram Gopal Varma (@RGVzoomin) October 20, 2022