
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ దాన్ని వివాదాస్పదం చేస్తూ ఉంటారు. తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు. ఈసారి వర్మ కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు వైరస్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణకు క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణలోని తమ సంస్థకు చెందిన చారిటీ గదుల్ని క్వారంటైన్ సెంటర్లుగా వాడుకోమని ఓక వీడియో ద్వారా తెలిపారు.
అయితే ఇప్పటికే కరోనా వైరస్ పై పలు రకాలుగా ట్వీట్లు చేసిన వర్మ.. తాజాగా కేఏ పాల్‌ను ఉద్దేశిస్తూ..…‘అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు’. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మ’ అని కేఏ పాల్‌పై సెటైర్లు వేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
https://twitter.com/RGVzoomin/status/1240354208987004928?s=20