Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అంటే అక్కసు. చాలా కాలంగా వర్మ పవన్ కళ్యాణ్ ని కించపరిచే చర్యలకు పాల్పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వర్మ సినిమాలు కూడా చేశారు. ‘పవర్ స్టార్’ అనే మూవీ చేసి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ మానసికంగా నలిగిపోయాడంటూ… ఓ కల్పిత కథనం తెరపైకి తెచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. విసిగిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకసారి వర్మ ఆఫీస్ మీద దాడి చేశారు.
అయినా వర్మ మారింది లేదు. తాజాగా ఆయన వ్యూహం టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా వ్యూహం మూవీ తెరకెక్కింది. పూర్తిగా సినిమాటిక్ స్టైల్ వదిలేసి వర్మ ఈ మూవీ తెరకెక్కించాడు. డిసెంబర్ 29న విడుదల కానుంది.వ్యూహం చిత్రంలో జగన్ ని హీరోగా చంద్రబాబు, సోనియా గాంధీ, పవన్ కళ్యాణ్, లోకేష్ లను విలన్స్ గా చిత్రీకరించారు.
ఈ సినిమా విడుదల ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. ఇది పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయ నాయకుల సైకాలజీ ఆధారంగా తెరకెక్కింది. వాళ్ళు బయటకు ఎలా కనిపిస్తారు? లోపల ఎలాంటి కుట్రలు పన్నుతారు? అనేది చెప్పాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ విషయంలో జరిగిన పరిస్థితులు చెప్పాను.
వూహ్యం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ కథ. ఎన్టీఆర్ ని చెడ్డవాడిగా చిత్రీకరించిన చంద్రబాబు, ఆయన అభిమానుల ఓట్లు దూరం కాకుండా తర్వాత మహానుభావుడు అన్నాడని వర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ పై వర్మ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటించినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు నన్ను నిరుత్సాహానికి గురి చేశాయి. తెలంగాణలో బర్రెలక్క ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసింది. ఆమెకున్న ధైర్యం కూడా పవన్ కళ్యాణ్ కి లేదు. చంద్రబాబు వద్ద బర్రెగా గొర్రెగా ఉండిపోతున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. వర్మపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.