Prince Yawar
Prince Yawar: బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి అడుగుపెట్టాడు ప్రిన్స్ యావర్. హౌస్ లోకి వచ్చేవరకు యావర్ గురించి ఎవరికీ అంతగా తెలియదు. భాష రాకపోయినా .. తెలుగు రియాలిటీ షో లో అన్ని వారాలు ఉండగలగడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 7 లో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ప్రిన్స్ యావర్ ఫినాలే రోజు రూ. 15 లక్షలతో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే హౌస్ లో ఉన్నపుడు మూడో వారంలో యావర్ కి కోపం ఎక్కువ .. చెప్పింది అర్థం కాదు అంటూ హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు. దీంతో తన కోపానికి, ఆవేశానికి, బాధకు అసలు కారణం ఆకలి అని శివాజీతో చెప్పుకుని యావర్ బాధ పడ్డాడు. అతను జీవితంలో ఏదైనా సాధించాలని ఆకలితో అలమటిస్తున్నానని అన్నాడు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు .. రెండు జతలే ఉన్నాయి అని చెప్పాడు. షో కి రావడానికి ముందు లోన్ తీసుకుని వచ్చాను అన్నాడు యావర్.
తనకు చాలా అప్పులు ఉన్నాయి అని .. నా అన్నల సహకారంతో ఇక్కడి వరకు రాగలిగాను అని చెప్తూ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు యావర్. తనకు డబ్బు చాలా అవసరమని ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ యావర్ అన్నయ్య తమకు అప్పులు ఉన్న మాట వాస్తవమేనని అన్నాడు.. రూ. 50 లక్షలు ఇచ్చినా సరిపోదు అన్నాడు
యావర్ సోదరుడు మాట్లాడుతూ .. ‘ మాది ఉమ్మడి కుటుంభం. మేము నలుగురం అన్నదమ్ములం .. ఇంకా నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేసాం. రూ. 30 – 35 లక్షల వరకు అప్పు ఉంది. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ప్రిన్స్ బిగ్ బాస్ కు వెళ్ళినపుడు .. తనకు వచ్చే డబ్బుతో మంచి ఇల్లు తీసుకుందాం అన్నాడు. మరో పక్క లక్షల్లో అప్పులు .. మా పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకొచ్చాడు యావర్ సోదరుడు సుజా అహ్మద్.