spot_img
Homeఎంటర్టైన్మెంట్ప‌వ‌న్ ఇమేజ్ పై.. రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప‌వ‌న్ ఇమేజ్ పై.. రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

RGV Comments On Pawan
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ మూవీ ‘ఆర్జీవీ దెయ్యం’. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టిన వ‌ర్మ‌.. తాజాగా మీడియాతో ముచ్చ‌టించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌వన్ క‌ల్యాణ్ గురించి మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆర్జీవీ స‌మాధానాలు ఇచ్చారు.

‘వ‌కీల్ సాబ్ చిత్రాన్ని చూశారా?’ అన్న ప్ర‌శ్న‌కు.. వ‌కీల్ సాబ్ సినిమా చూడలేదుగానీ.. ట్రైలర్ చూశానని, చాలా బాగా నచ్చిందని చెప్పారు ఆర్జీవీ. ఆ సినిమాకు వ‌చ్చిన రివ్యూలు కూడా చూశాన‌ని తెలిపారు. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భ‌విష్య‌త్ లో సినిమా చేసే ఆలోచ‌న ఉందా? అనే ప్ర‌శ్న‌కు సైతం ఆయ‌న బ‌దులిచ్చారు.

‘ప‌వ‌న్ తో సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు.. ఆయ‌న భారీ ఇమేజ్‌, హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానుల అంచ‌నాల‌ను అన్నింటినీ లెక్క‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ మేనేజ్ చేయ‌డం నాకు చేత‌కాదు. ఎందుకంటే.. నేను జోన‌ర్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను.’ అని చెప్పారు.

తన జోనర్ సినిమాల్లోకి స్టార్ హీరోలను తీసుకుంటే కుదరదు. అది వారి కూడా మంచిది కాదని చెప్పారు. ఇక, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాలు తీయాల‌నే ఉద్దేశం కూడా త‌న‌కు లేద‌ని చెప్పారు ఆర్జీవీ. కాగా.. ఆర్జీవీ దెయ్యం సినిమాలో రాజ‌శేఖ‌ర్, స్వాతి దీక్షిత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే పాన్ ఇండియా మూవీగా అన్ని ప్ర‌ధాన భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version