https://oktelugu.com/

Ram Gopal Varma: ఇంత నీచమైన ఆరోపణలు 4th గ్రేడ్ వెబ్ సైట్స్ కూడా ప్రచారం చేయలేదు’ అంటూ మంత్రి కొండా సురేఖ పై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం!

రాజ్యాంగ బద్దమైన పదవిలో కూర్చొని ఇంతటి నీచమైన, హేయమైన వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రి చేయడం ఇప్పటి వరకు మనం చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండము. దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఖండించారు. మరోపక్క సినీ ఇండస్ట్రీ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 11:02 am
    Ram Gopal Varma(3)

    Ram Gopal Varma(3)

    Follow us on

    Ram Gopal Varma: కేటీఆర్ ని దూషించే క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి అత్యంత నీచంగా చేసిన కొన్ని కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లోనూ, సినీ ఇండస్ట్రీ లోనూ పెను దుమారమే రేపింది. రాజ్యాంగ బద్దమైన పదవిలో కూర్చొని ఇంతటి నీచమైన, హేయమైన వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రి చేయడం ఇప్పటి వరకు మనం చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండము. దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఖండించారు. మరోపక్క సినీ ఇండస్ట్రీ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని వంటి వారు దీనిపై తీవ్రంగా స్పందించారు. కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. తనకి జీవితాన్ని ఇచ్చిన అక్కినేని నాగార్జున పై రామ్ గోపాల్ వర్మకు ఎనలేని గౌరవం అనే విషయం మన అందరికీ తెలిసిందే.

    ఆయన మాట్లాడుతూ ‘ నాగార్జున గారి కుటుంబంపై హేయమైన కామెంట్లు మంత్రి స్థాయిలో కూర్చున్న కొండా సురేఖ వంటి వారు చేయడం చూసి నేను షాక్ అయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడం కోసం ఇండస్ట్రీ లో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న నాగార్జున ఫ్యామిలీ ని రోడ్డు మీదకు లాగి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?, దీనిని ఏమాత్రం సహించకూడదు. కేటీఆర్ ని దోషించాలనుకుంటే రాజకీయంగా దూషించాలి, అంతే కానీ సంబంధం లేని వ్యక్తులను అందులోకి లాగి మాట్లాడితే వారికి బాధ కలుగుతుంది అనే ఇంకిత జ్ఞానం కూడా మంత్రి గారికి లేకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నిన్ను రఘునందన్ విషయం లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవమానించారని నువ్వు ఎంత బాదపడ్డావో, నాగార్జున కుటుంబాన్ని అన్యాయంగా ఇందులోకి లాగినప్పుడు వాళ్ళు బాధపడతారు అనే విషయం నీకు తెలియదా?, వాళ్ళని ఈ స్థాయిలో అవమానించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?, నీ జోలికి వాళ్ళు రాలేదు కదా?..4th గ్రేడ్ వెబ్ సాయిలు, యూట్యూబ్ చానెల్స్ కూడా ప్రచారం చెయ్యలేని జుగుప్సాకరమైన నిందలు తన కళ్ళతో దగ్గరుండి చూసినట్టు కొండాసురేఖ మాట్లాడడం దారుణమైన విషయం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    దీనికి కొంతమంది నెటిజెన్స్ నుండి కూడా రామ్ గోపాల్ వర్మ కి వ్యతిరేకత ఏర్పడింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నువ్వు ఎన్నో సార్లు మార్ఫింగ్ ఫొటోలతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారిని విమర్శించావు, నువ్వు కూడా ఇలాంటి నీతి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం గా ఉంది. గత ఎన్నికలలో నువ్వు సపోర్ట్ చేసిన వైసీపీ పార్టీ నాయకుడు పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ కూతురిపై అత్యంత నీచంగా చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేకపోయావు అంటూ నెటిజెన్స్ నిలదీస్తున్నారు.