Konda Movie: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు నచ్చింది చేయడం.. మనసులోని మాటలను మొహమాటం లేకుండా బయట పెట్టడం ఆర్జీవి స్టైల్. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో ఆర్జీవి సృష్టించిన సెన్సేషన్స్ అంతా ఇంతా కావు. కానీ సినిమాల కంటే తన ట్వీట్స్ తో, మాటలతో ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎవరి బయోపిక్ అయినా ధైర్యంగా తీయగలిగే సత్తా ఆర్జీవికి ఒక్కడికే ఉంది. అందుకే రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు వర్మ. గతంలో అనేక రాజకీయ నాయకుల బయోపిక్స్ తో హల్ చల్ చేసిన ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు.

దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. ఇందులో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరంగల్‌లోని కొండ మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. హనుమకొండలో ఆఖరి షెడ్యుల్ పూర్తైన తర్వాత చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గా కనిపించి సందడి చెశారు. నక్సలైట్ గెటప్‌లో ఉండి..తల్వార్ చేతపట్టి కేక్‍ను నరికేస్తూ హల్చల్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు వర్మ. ఈ పార్టీకి కొండా మురళి, కొండా సురేఖలు కూడా వచ్చారు. వారు కూడా సినిమా గురించి మాట్లాడి ఆర్జీవితో ఫోటోలు దిగారు. ఆర్జీవీ నక్సలైట్ గెటప్ లో రావడమే కాకుండా ఈ సినిమాలోని పాటలకు పాటలకు నటీనటులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు.