Homeఎంటర్టైన్మెంట్Hero Nikhil: సినిమా ఆలూ నాకు దేవాలయాలు లాంటివి : హీరో నిఖిల్

Hero Nikhil: సినిమా ఆలూ నాకు దేవాలయాలు లాంటివి : హీరో నిఖిల్

Hero Nikhil: గత రెండేళ్లుగా మహమ్మారి కరోనా కారణంగా థియేటర్స్ లో సిని సందడి మూగబోయింది. ఈ ఏడాది వరుస భారీ చిత్రాలతో మునుపటి వైభోగం థియేటర్లో కనిపిస్తుంది.ఒక సినిమా తర్వాత ఒకటి విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలానే సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నుండి ఒక చిక్కు కూడా ఏర్పడింది. గత కొన్ని నెలల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ పెద్దలు అందరూ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.అలానే ఒకరి తర్వాత ఒకరు తమదైన శైలిలో ట్విట్టర్ వేదిక ద్వారా ఏపీ ప్రభుత్వానికి టికెట్స్ తెరపై ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సినీ టికెట్స్ పై హీరో నాని,సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

hero nikhil sensational comments about movie ticket price issue

తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా ఈ విషయంపై స్పందించారు…వివిధ టైర్ కంపార్ట్‌మెంట్ల ఆధారంగా ట్రైన్ టికెట్ రేట్లను ఎలా నిర్ణయిస్తున్నారో అలాగే థియేటర్స్ టికెట్ రేట్లను నిర్ణయించాల్సిదిగా కోరాడు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 20 రూపాయల టిక్కెట్ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్‌తో బాల్కనీ/ప్రీమియం విభాగాన్ని అనుమతించమని అధికారులకు అభ్యర్థనను తెలిపారు.అలాగే, థియేటర్లు నాకు దేవాలయం లాంటివి. ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. థియేటర్లు మూతపడడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషం. ఈ విషయంలో వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలానే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై మార్పులు చేస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version