Agricultural Laws: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలతో దేశంలో రగడ రేగింది. రైతు సంఘాలు ఆందోళన చేశాయి. నెలలుగా ప్రభుత్వంపై పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రైతు చట్టాలను రద్దు చేయడంతో రైతులు ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్ననట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన చూస్తుంటే ఇది నిజమే అనే భావన కలుగుతోంది.

కేంద్రం రైతు చట్టాలను మళ్లీ తీసుకొస్తే ఎవరు కూడా ఉపేక్షించరని తెలిసిందే. కానీ న్రభుత్వం మొండి వైఖరి అవలంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాను అనుకున్నది చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మూడో సారి అధికారంలోకి వస్తే రైతు చట్టాలను మళ్లీ ముందుకు తీసుకొచ్చేలా చేస్తుందని భావిస్తున్నారు.
Also Read: జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.. ఎందుకిలా ముగించారు?
కానీ కేంద్రం అలా చేస్తే రైతుల నుంచి మళ్లీ నిరసనలు కొనసాగే వీలుంది. వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆలోచించే రైతు చట్టాలు మళ్లీ తెస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే సూచనలే కనిపిస్తున్నాయి. దీంతో రైతు చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆగ్రహం కలగనుంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీ ప్రభుత్వం మళ్లీ రైతు చట్టాలను తెర మీదకు తీసుకువస్తుందని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తే అడ్డుకునేందుకు రైతులకు కూడా మార్గాలున్నాయని రైతు సంఘాలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయ చట్టాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: వైఎస్‌ను ఫాలో అవుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అదొక్కటే మార్గమా..?