
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సన్సేషన్ సినిమాతో రాబోతున్నాడు. తెలంగాణతోపాటు యావత్ దేశాన్ని అట్టుడికించిన ‘దిశ’ సంఘటనపై వర్మ సినిమాను తెరక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. దిశపై అత్యాచారం.. హత్య.. ఆపై ఎన్ కౌంటర్ నేపథ్యంలో సినిమా రాబోతుంది. మృగాళ్లు ఇలాంటి సంఘటనలు చేయాలంటేనే భయపడేలా సినిమా ఉండబోతుందని గతంలో ప్రకటించిన రాంగోపాల్ వర్మ తాజాగా ఫస్టు రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో వివాదాస్పదమైన, సంచలనం సృష్టించిన ఎన్నో సంఘటనలను రాంగోపాల్ వర్మ తెరపైకి తీసుకొచ్చాడు. గతంలో పరిటాల రవి హత్య నేపథ్యంలో ‘రక్తచరిత్ర’.. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంట్రీపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లను తెరకెక్కించి హిట్టందుకున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా కూడా ప్రణయ్-అమృత ప్రేమ కథతోనే రాబోతుంది. తాజాగా దిశ ఎన్ కౌంటర్ సంఘటనను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?
దిశ.. ఎన్ కౌంటర్ పేరుతో వర్మ విడుదల చేసిన ఫస్టు లుక్ సినిమా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. వాస్తవ సంఘటలను కళ్లకు కట్టేలా వర్మ.. తనదైన సస్పెన్స్ థ్రిల్లర్లో ఈ మూవీని చూపించడం ఖాయంగా కన్పిస్తోంది. దిశ ఘటనకు కారణమైన టోల్ గేట్.. అండర్ బ్రిడ్జి.. స్కూటీ.. లారీ వంటి వాటిని ఫస్టు లుక్కులోనే వర్మ చూపించాడు. ఈమేరకు ‘దిశ’ ఫస్టు లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమా టీజర్ ఈనెల 26 రాబోతుందని వర్మ తెలిపాడు. సినిమా నవంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు వర్మ ప్రకటించి మరోసారి తన స్టైలే సపరేట్ అని నిరూపించాడు.