Ram Gopal Varma: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంటూ రెండు రంగాల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఎన్నికలు రానుండడంతో ఫోకస్ మొత్తం రాజకీయాల వైపే పెట్టారు పవన్. ఇక వైసీపీ, జనసేన అధ్యక్షుడు పవన్ మధ్య మాటల యుద్దం నడుస్తుందనే చెప్పాలి. పవన్ ను విమర్శించే నేపథ్యంలో ఆయన పెళ్లిల్ల పైనే ఎక్కువగా మాట్లాడుతుంటారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు సీఎం జగన్ ఇళ్లను అందించి లబ్ధిదారులందరితో గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు దత్తపుత్రుడి పెళ్లిల్ల గురించి మీకు తెలిసిందే అని సంభోదించాడు.
మూడు పెళ్లిల్ల గురించి ప్రస్తావిస్తూ ఓ సారి లోకల్, మరోసారి నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. అంతే కాదు ఆయనకు మహిళలపై ఉన్న గౌరవం ఇదే.. అసలు వివాహ వ్యవస్థపై గౌరవమే లేదంటూ విమర్శించారు. అంతే కాదు గాజువాక, భీమవరంతో పవన్ కు సంబంధం లేదని విమర్శించారు. సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ స్వంత పార్టీని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామని .. అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు.
సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకున్న వ్యక్తి పవన్ అంటూ మరో అడుగు ముందుకు వేసి మరీ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన కామెంట్స్‌ని కొందరు ఖండిస్తుండగా మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు. అయితే లోకల్, నేషన్, ఇంటర్నేషనల్ అయితే కరెక్ట్ కదా.. మిగతా కంటెక్ట్స్ తెలియదు కాని, ఆయన చేసుకున్న వారిలో తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, వేరే దేశానికి చెందిన అమ్మాయి ఉంది కదా అని వర్మ అనడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. ఎవరు మాట్లాడినా వైరల్ కానీ కంటెంట్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే కచ్చితంగా వైరల్ అవడం పక్కా అంటున్నారు ఆర్జీవీ అభిమానులు.