RGV on Chiranjeevi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…శివ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ఆయన ఆ తర్వాత చేసిన మరికొన్ని సినిమాలతో పెను సంచలనాలను సృష్టించాడు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఆయన దగ్గర పనిచేసిన చాలామంది దర్శకులుగా మారడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసినవారు కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి చాలా మంచి మనిషి అని ఆయనతో నేను చేయాలనుకున్న సినిమా ఆగిపోవడానికి కారణం ఆయన సినిమాలో ఇంటర్ ఫియర్ అవ్వడం వల్ల కాదని, అసలు ఆయన స్క్రిప్ట్ లో ఎప్పుడూ మార్పులు చెప్పలేదని చెప్పాడు. ఆయనతో సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేనే..నాకు బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో నేను అటు వెళ్ళిపోయాను దానివల్ల ఆ సినిమా ఆగిపోయింది అంటూ వర్మ చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా వర్మ తన తప్పును తాను ఒప్పుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమా గ్లింప్స్.. రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలను చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. అలాగే తన ఎంటైర్ కెరియర్ లో తను చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా అమితాబచ్చన్ తో చేసిన సర్కార్ లాంటి సినిమాతో ఆయన సైతం స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు…
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అంటూ రాంగోపాల్ వర్మ చెప్పిన మాటలు పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో అమితాబచ్చన్ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉండబోతుందంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ను తొందర్లోనే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
ఇక ఏది ఏమైనా కూడా వర్మ లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. ఒకప్పుడు ఆయన మేకింగ్ కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉండేవారు. అలాగే అతనితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపించడం విశేషం… ఇక ఇప్పటికి అతనిని ఆరాధించే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…