Ram Charan Upasana Daughter: మెగా ఫ్యామిలీలో అన్నీ శుభ శకునాలే. రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఏకంగా ఆస్కార్ మూవీలో నటించిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. వరుణ్ తేజ్ కి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జరిగింది. వీటన్నింటికీ మించి పెళ్ళైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న ఉపాసన ఆడపిల్లకు జన్మనిచ్చారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో ఉపాసనకు డెలివరీ అయ్యింది. అర్ధరాత్రి 1:49 నిమిషాలకు ఉపాసనకు కూతురు పుట్టింది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ దంపతులు కూతురికి ఏం పేరు పెడతారనే సందిగ్ధత నెలకొంది. కూతురు పుట్టాక మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఈ విషయమై మాట్లాడారు. పేరు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అయితే సాంప్రదాయబద్దంగా బారసాల వేడుకలో ప్రకటిస్తాము, అన్నారు. ఇక కూతురుది ఎవరి పోలిక అంటే… ఖచ్చితంగా నా పోలికే అని రామ్ చరణ్ ఛలోక్తి వదిలాడు.

కూతురు పుట్టి పదకొండు రోజులు అవుతుండగా నేడు బారసాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బారసాల వేడుక కోసం ఇంటిని సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రముఖ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీకి బాధ్యత అప్పగించారు. కూతురు బారసాల వేడుక గురించి ఇండస్ట్రీ మొత్తం చెప్పుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అవసరమైన వస్తువులు తెప్పించారు. సాయంత్రం కార్యక్రమం అని తెలుస్తుండగా ఈ సమయానికి అనేది స్పష్టత లేదు.
రామ్ చరణ్ కూతురు బారసాల కార్యక్రమానికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. ఈ వేడుక ముగిశాక ఇండస్ట్రీ ప్రముఖుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారట. ఇక బారసాల ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు ఉపాసన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మరో వైపు చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం బుచ్చిబాబుతో ఓ మూవీ ప్రకటించారు.