Mukesh Ambani- Ram Charan: రామ్ చరణ్ కూతురుకి వెలకట్టలేని బహుమతిని ఇచ్చిన ముఖేష్ అంబానీ..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు?

ఇది ఇలా ఉండగా నేడు రామ్ చరణ్ కూతురుని ఉయ్యాలలో వెయ్యబోతున్నారు, నామకరణం కూడా నేడే జరగబోతుంది. అయితే చిరంజీవి మరియు ఉపాసన కుటుంబాలతో మొదటి నుండి ఇండియాలోనే అపర కుభేరుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ మంచి మిత్రుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన తరుపున నుండి రామ్ చరణ్ కూతురుకు బహుమతి గా ఒక బంగారు ఊయల పంపించాడట. ఈ ఊయల బరువు రెండు కేజీలపైనే ఉంటుందట.

Written By: Vicky, Updated On : June 30, 2023 11:52 am

Mukesh Ambani- Ram Charan

Follow us on

Mukesh Ambani- Ram Charan: కోటీశ్వరుల ఇంట్లో పుట్టడానికి అదృష్టం చేసుకోవాలని అందరూ అంటూ ఉంటారు. కొన్ని కొన్ని సంఘటనలు చూసిన తర్వాత నిజమే కదా అని అనిపించక తప్పదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి జీవితం దక్కదు, దీనికి రీసెంట్ ఉదాహరణగా రామ్ చరణ్ మరియు ఉపాసన కి రీసెంట్ గా పుట్టిన బిడ్డని తీసుకొవఛు. ఈ దంపతులిద్దరూ పెళ్లి చేసుకొని 11 ఏళ్ళ తర్వాత బిడ్డకి జన్మనిచ్చారు.

ఇది అభిమానులకు ఎంతో మంచి శుభవార్త, ఈ వార్త కోసమే వారు ఏళ్లతరబడి ఎదురు చూసారు. ఎప్పుడైతే ఈ శుభవార్త విన్నారో, అప్పటి నుండి అభిమానులు పాప నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలని పూజలు చేయించారు. ఇక ఉపాసన డెలివరీ జరిగే రోజు ప్రపంచం లో ఉన్న ప్రఖ్యాత డాక్టర్స్ అందరూ ఆరోజు అపోలో హాస్పిటల్స్ లో దర్శనమిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఆమె డెలివరీ కోసమే కోటి 50 లక్షల రూపాయిలు ఖర్చు చేశారట.

ఇది ఇలా ఉండగా నేడు రామ్ చరణ్ కూతురుని ఉయ్యాలలో వెయ్యబోతున్నారు, నామకరణం కూడా నేడే జరగబోతుంది. అయితే చిరంజీవి మరియు ఉపాసన కుటుంబాలతో మొదటి నుండి ఇండియాలోనే అపర కుభేరుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ మంచి మిత్రుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన తరుపున నుండి రామ్ చరణ్ కూతురుకు బహుమతి గా ఒక బంగారు ఊయల పంపించాడట. ఈ ఊయల బరువు రెండు కేజీలపైనే ఉంటుందట.

అంటే దాని విలువ కచ్చితంగా కోటి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ విషయాన్నీ చిరంజీవి కి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పాత్రికేయుడు తెలిపాడు. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని అంటూ ఉంటారు కదా, ఇలాంటివి చూసినప్పుడే అర్థం అవుతూ ఉంటుంది. ఇక రామ్ చరణ్ తన కూతురుకి ఏమి పేరు పెట్టబోతున్నాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.